Sunday, September 8, 2024
spot_img

గ్రామ అభివృద్ధిలో కీలక భూమికపంచాయతీ సెక్రెటరీలదే..

తప్పక చదవండి
  • జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలు
    గ్రామ అభివృద్ధి నిర్మాతలు
  • భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలి..
  • ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి..
  • దేశ నిర్మాణంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ప్రముఖ పాత పోషిస్తుంది.. అలాంటి గ్రామీణ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో పనిచేసే జూనియర్‌ పంచాయితీ సెక్రెటరీలు గురుతర బాధ్యత నిర్వహిస్తూ వుంటారు.. అలాంటి వారి సేవలు వినియోగిచుకోవడం ఎంతో ముఖ్యం.. ఈ వాస్తవాన్ని గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించడం ముదావహం..
    హైదరాబాద్‌ : జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీలు గ్రామ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారని అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండల్‌ మహిళారీ గూడంలో జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీలను పర్మినెంట్‌ చేస్తూ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గొంగిడి సునీత మహీందర్‌ రెడ్డి హజరై వారికి పర్మినెంట్‌ నియమాక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యంలో పంచాయితీ సెక్రటరీల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌ గ్రామాల అభివృధ్ధి కోసం కన్న కలలను జూని యర్‌ పంచాయతీ సెక్రెటరీలు అభివృద్ధి చేసి నిరూపించారన్నారు. గ్రామ పంచాయతీలో చేపట్టిన టువంటి అనేక అభివృద్ధి పథకాలకు పంచాయతీ సెక్రటరీలు ప్రజలను చైతన్య పరిచి, అభివృద్ధికి సహకరించారని ఆమె గుర్తు చేశారు. ఈ నియామక పత్రాల ద్వారా పంచాయతీ సెక్రెటరీలకు పర్మినెంట్‌ ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత కేసీఆర్‌ కి దక్కుతుందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు