Sunday, September 8, 2024
spot_img

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలి..

తప్పక చదవండి

-పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్..

హైదరాబాద్, మొన్న దీపికా, నేడు లిఖిత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల క్యాంపస్ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.. వరుసగా ఈ రెండు రోజులల్లో విద్యార్థులు చనిపోవటం రెండోసారి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన దీపికా ఆత్మహత్యకు చీఫ్ వార్డెన్, మధుసూదన్, స్టూడెంట్ డీన్ దత్తు, కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు వీటిపైన విచారణ జరిపి బాద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాo.. వరుసగా విద్యార్థులు చనిపోతున్న ఘటనపై ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయిలో విచారణ జరిపి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని విద్యార్థుల కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యార్థుల్లో ఆత్మస్టైర్యం నింపే విధంగా వెంటనే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.. గతంలో వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. నిరవధిక నిరసన చేసి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవటం జరిగింది.. కానీ అధికారులు ఇచ్చిన పలు హామీలు పెండింగ్ లో ఉన్నాయి.. వాటి పరిష్కారానికి పోరాటం చేయాలి కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు, అని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కేటీఆర్, విద్యాశాఖ మంత్రి చొరవ తీసుకుకోవాలి.. వెంటనే క్యాంపస్ ను సందర్శించి వారికి నమ్మకం కలిగే విదంగా చేసి క్యాంపస్ లో విద్యార్థులపై నిర్బంధం ప్రయోగించకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేవిదంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు, మామిడికాయల పరశురాం డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు