Sunday, September 8, 2024
spot_img

బీ.ఆర్.ఎస్. కు మరోసారి అవకాశం ఇవ్వండి..

తప్పక చదవండి
  • విజ్ఞప్తి చేసిన ఎం.ఐ.ఎం. చీఫ్ అసదుద్దీన్..
  • ప్రతి సభలోనూ కేసీఆర్ పై ప్రశంశలు..
  • రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు..
  • ఇంకొకడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు..
  • అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం : ఒవైసీ..

హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఏకంగా ఐటీ టవర్స్‌ నిర్మించి.. అభివృద్ధికి బాట వేసింది. పాతబస్తీలోని సమస్యలకు పరిష్కారం దిశగా.. అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇటీవల జరిగిన ఐటీ టవర్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ.. రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో ఎంఐఎం నేతలు ప్రతీ కార్యక్రమంలోనూ సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సైతం ఎక్కడికి వెళ్లినా.. ముందుగా కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని ప్రశంసిస్తూనే సభను ప్రారంభిస్తున్నారు. రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

అంతే కాకుండా రాష్ట్రంలో ఒక బ్లాక్‌ మెయిలర్‌ ఉన్నాడని, మరొకరు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారికి అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రశాంతతకు భంగం కలుగుతుందని అసదుద్దీన్‌ ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు తీరుస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. పంపుసెట్ల వినియోగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో సీఎం కేసీఆర్‌ నిలబెట్టారని.. చేపలు, గొర్రెల పెంపకంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఓవైసీ అన్నారు. మైనార్టీల కోసం కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని, మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ముస్లింలకు మైనార్టీ స్కాలర్‌షిప్‌లు, శ్మశాన వాటికల కోసం 125 ఎకరాల ల్యాండ్లు, పాతబస్తీలో ఐటీ టవర్‌, మైనార్టీ లోన్లు ఇవన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి మంచి మనసుకు నిదర్శనమని ఓవైసీ అన్నారు. ఒకప్పుడు పాతబస్తీ అంటేనే భయపడేవాళ్లు, ఇక్కడికి ఎవరూ వచ్చేవారు కూడా కాదు.. అలాంటి పాతబస్తీలో అభివృద్ధికి కేసీఆర్‌ ముందుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఒక పార్టీలో బ్లాక్‌మెయిలర్‌కు అధికార పగ్గాలు ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అసదుద్దీన్‌ హెచ్చరించారు. మరో పార్టీ నేత మతవిద్వేషాలను రెచ్చగొడుతుంటారని, వీరు అధికారంలోకి వస్తే తెలంగాణలో శాంతిభద్రతలు సర్వనాశనం అవుతాయని అసద్‌ అన్నారు. పాతబస్తీలో జరిగిన ఐటీ టవర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేసి తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్‌ హీట్ పెంచుతూనే రెండు ప్రముఖ పార్టీల అగ్రనేతలకు చురకలు అంటించారు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు