Sunday, September 8, 2024
spot_img

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ‘ముగ్గురికి’ పరాభవం తప్పదా…!?

తప్పక చదవండి

-ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత…
-అభివృద్ధి పట్ల నిర్లక్ష్యమే కారణమా..?
-ఈ సారి ఓటుతో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమా.?

పర్వతగిరి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గాల్లో అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అరూరి రమేష్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లకు, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటమి తప్పదా అంటే మెజారిటీ ప్రజలు అవుననే ముందస్తు జోష్యం చెప్తున్నారు. వీరిలో ఒకరు స్థానిక ఎమ్మెల్యే కాగా! మరో ఇద్దరు పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన వారు. స్థానికేతరుడైననూ రెండు సార్లు భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే అరూరికి కొంతమంది సొంత పార్టీ ప్రధాన కార్యకర్తలు, బూతు కన్వీనర్ల నుండి తీవ్రవెతిరేకత వుంది. ప్రత్యేక పనులు ఏమి చేయలేదని, దొరల సామాజిక వర్గానికి చెందిన వారికి ముందుగా బిల్లులు రావడం, మిగిలిన వారిని పట్టించుకోలేదని, అందులో దళితులను రాజకీయంగ ఎదగకుండ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో ప్రజలు తమ సమస్యలను చెప్పనీయకుండ తమ సెక్యూరిటి వారిని ఆజ్ఞాపించి కలువకుండ చేయడం అంతా ప్రజలు గమనిస్తూ! మార్పు కోరుతున్నట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు. స్థానికులు మంత్రి ఎర్రబెల్లి డీలర్‌ నుండి డాలర్ కు ఎదిగి, వందల ఎకరాల భూములు, ఆస్తులు సంపాదించడంలో ఉన్న శ్రద్ధ నియోజక అభివృద్ధి మీద లేదని, గత 5 సం”ల నుండి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుందని, మట్టికైనా ఇంటివాడే కావాలనే సామెతను గుర్తుచేస్తు ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సంబంధిత ప్రజలు తెలుపుతున్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్సీ కడియం విషయంలో మాత్రం విద్యావంతుడు, అభివృద్ధి ప్రధాత, మచ్చలేని నాయకుడనే పేరున్నను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు చెందిన ఎవరైనను అధికార పార్టీ తరఫున పోటీ చేస్తే ఓడించాలని, ఎందుకంటే గెలిస్తే కెసిఆర్ నాయకత్వం లోనే పనిచేయవలసి వస్తుందని, జర్నలిస్టుల రఘు చెప్పినా విధంగా ప్రజలు ఆలోచిస్తూ రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడాలని ఎదురు చూస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఓటర్ టు ఓటర్ ప్రచారం చేసుకొని, నాటి ప్రస్తుత అధికార పార్టీని గెలిపించిన విధంగానే, నేడు పార్టీలకు అతీతంగా ఓటర్ టు ఓటర్ ప్రచారం చేసుకుంటూ అధికార పార్టీని ఇంటికి సాగనంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలుపుతున్నారు. ఈ విధంగా చూస్తే త్రిమూర్తులకు ఓటమి తప్పదని తెలుస్తుంది. డిసెంబర్ 3వ తారీకు వరకువేచి చూడాలి మరి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు