Sunday, September 8, 2024
spot_img

అందెల శ్రీ రాములు యాదవ్‌నుబీజేపీ నుండి బహిష్కరించాలి

తప్పక చదవండి

దళిత సంఘాల డిమాండ్‌

అల్మాస్‌ గూడ : మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌ పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో అల్మాస్‌ గూడ మాజీ సర్పంచ్‌ ముత్యాల కృష్ణ సోదరుడైన ముత్యాల నరసింహపై మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్‌ అందెల శ్రీరాములు యాదవ్‌ వారి అనుచరులు దాడి చేయడం దారుణమని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యా ప్రయత్నం కేసు నమోదు చేయాలని తెలంగాణ దళిత సంఘాల ఐక్య పోరాట సమితి చైర్మన్‌ బేరా బాలకిషన్‌ డిమాండ్‌ చేశారు.గురువారం ఉదయం అందెల శ్రీ రాములు యాదవ్‌ వారి అనుచరుల చేతిలో తీవ్ర గాయాలు పాలైన ముత్యాల నరసింహని అల్మాస్‌ గూడలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ కాలనీలో పరామర్శించారు.జరిగిన సంఘటనను ముత్యాల నరసింహను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అందెల శ్రీ రాములు యాదవ్‌ వారి అనుచరుల చేతిలో తీవ్ర గాయాల పాలైన ముత్యాల నరసింహని కనీసం పరామర్శించిన పాపాన పోలేదని, కనీసం పక్క గ్రామస్తుడన్న మర్యాద లేకుండా అహంకారంతో తమ గ్రామంలో ఏమి అభివృద్ధి చేసినవ్‌ అని అడిగినందుకు ముత్యాల నరసింహ మీద దాడులు చేయించాడని ఇలాంటి దాడులను, దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవని రెండు రోజుల్లో అందెల శ్రీ రాములు యాదవ్‌ వారి అనుచరుల మీద చర్యలు తీసుకోకపోతే తెలంగాణ దళిత సంఘాల ఆధ్వర్యంలో ‘చలో బడంగ్పేట్‌’ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా బాలకిషన్‌ హెచ్చరించారు.దళితుల మీద ముఖ్యంగా మాలమాదిగల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే శ్రీ రాములు యాదవ్‌ ని బిజెపి నుండి బహిష్కరించాలని, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని, వనస్థలిపురం ఏసీపిని స్వయంగా కలిసి సమస్యను వివరిస్తామని శ్రీ రాములు యాదవ్‌ మీద చర్యలు తీసుకునే వరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ముత్యాల నరసింహకు న్యాయం జరిగే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బాలకిషన్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అల్మాస్‌ గూడ కార్పొరేటర్‌ ముత్యాల లలిత కృష్ణ, పుట్టగల సంతోష్‌, మేకల సత్యనారాయణ, నాలుకల నర్సింగ్‌ రావు, మొగిళ్ల మల్లేష్‌, సంజీవ శ్రీనివాస్‌, సురేందర్‌ లతో పాటు పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు