Sunday, September 8, 2024
spot_img

అఫ్గాన్ ముందు ఈజీ టార్గెట్

తప్పక చదవండి
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
  • 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్

లక్నోలో జరుగుతున్న ఈ పోరులో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు, ఫీల్డర్లు స్ఫూర్తిదాయకమైన ఆట ప్రదర్శించడంతో నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న 34వ లీగ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన నెదర్లాండ్స్‌.. తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. యువ స్పిన్నర్‌ ముజీబ్‌.. వెస్లీ బరెసి (1)ని ఔట్‌ చేశాడు. కానీ వన్‌ డౌన్‌లో వచ్చిన కొలిన్‌ అకర్‌మన్‌ (35 బంతుల్లో 29, 4 ఫోర్లు) తో కలిసి ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓడౌడ్‌ (40 బంతుల్లో 42, 9 ఫోర్లు) రెండో వికెట్‌ కు 69 పరుగులు జోడించారు. ఈ జోడీ అఫ్గాన్‌ పేసర్లతో పాటు స్పిన్నర్లు మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లను ధాటిగా ఎదుర్కున్నారు.

నెదర్లాండ్స్‌ రనౌట్‌..

- Advertisement -

11.2 ఓవర్లలో 72-1గా ఉన్న డచ్‌ జట్టును రనౌట్లు కొంపముంచాయి. ధాటిగా ఆడుతున్న ఓడౌడ్‌ లేనిపరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే క్రీజులో కుదురుకున్న అకర్‌మన్‌ కూడా అదే బాట పట్టాడు. ఆ తర్వాత సిబ్రండ్‌ (86 బంతుల్లో 58, 6 ఫోర్లు) నెదర్లాండ్స్‌ను ఆదుకున్నాడు. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ డకౌట్‌ కాగా బస్‌ డీ లీడె.. మూడు పరుగులే చేసి ఔట్‌ అయ్యాడు. సకిబ్‌ జుల్ఫికర్‌ 3 పరుగులే చేసి పెవలియన్‌ చేరాడు. ఆదుకుంటాడనున్న పేస్‌ ఆల్‌ రౌండర్‌ లొగాన్‌ వాన్‌ బీక్‌ (2) కూడా విఫలమయ్యాడు. 18.1 ఓవర్లలో 92-2గా ఉన్న ఆ జట్టు స్కోరు.. 20.2 ఓవర్‌కు 97-5గా మారింది.

క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో ఉన్న సిబ్రండ్‌.. అర్థ సెంచరీ తర్వాత నిష్క్రమించాడు. సిబ్రండ్‌ కూడా 35వ ఓవర్లో రనౌట్‌గానే వెనుదిరగడం గమనార్హం. అఫ్గాన్‌ బౌలర్లలో నబీ మూడు వికెట్లు తీయగా నూర్‌ అహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు