Sunday, September 8, 2024
spot_img

పక్షుల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌?

తప్పక చదవండి

చంఢీగడ్‌ : ప్రస్తుతం ఎవరూ పక్షులను పట్టించుకోవడం లేదు. కానీ, అక్కడక్కడ పక్షి ప్రేమికులు ఇప్పటికీ కనిపిస్తుంటారు. చంఢగీడ్‌కి చెందిన ఓ వ్యక్తి పక్షుల కోసం ఏకంగా అంబులెన్స్‌ని ఏర్పాటు చేసి.. ఎన్నో పక్షుల్ని రక్షిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కి చెందిన మన్‌జిత్‌సింగ్‌కి పక్షులంటే ఎంతో ఇష్టం. అతను ఓ ప్రయివేటు స్కూల్లో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఓసారి మన్‌జిత్‌సింగ్‌ ఫిరోజ్‌పూర్‌ పట్టణానికి వెళ్లాడు. అప్పుడతను ఓ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. స్వీపర్‌ చనిపోయిన పావురాన్ని ఊడ్చి చెత్తలో వేస్తుంది. అప్పుడు మనోజ్‌ ఆ పావురం ఎలా చనిపోయింది అని స్వీపర్‌ని అడిగితే.. ’పావురాలు ఇలా ఎప్పుడూ చనిపోతూనే ఉంటాయి’ అని బదులిచ్చింది. పక్షులు చనిపోవడాన్ని చూసి మనోజ్‌ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా పక్షుల్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తన సైకిల్‌నే అంబులెన్స్‌గా మార్చాడు. వ్యాధుల బారిన పడి పక్షలు చనిపోతే.. వాటిని ఖననం చేయడం.. ప్రమాదవశాత్తూ పక్షులకు గాయాలైతే వాటికి చికిత్సనందించడం వంటి పనులు చేస్తున్నాడు. ‘పక్షులు చనిపోయినా.. లేక ప్రమాదాలకు గురై కనిపించినా.. దయచేసి నాకు ఫోన్‌ చేసి తెలపండి’ అని కరపత్రాలు ముద్రించి… వాటిని ఇంటింటికి తిరిగి అందిస్తున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు