Sunday, September 8, 2024
spot_img

గొడవలొద్దు..

తప్పక చదవండి
  • మీ విభేదాలతో పార్టీకి నష్టం చేశారు
  • 30 సీట్లు వస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు
  • పార్లమెంట్‌ ఎన్నికల్లో అయినా కలసి పనిచేయండి
  • ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • 2019లో 17 సీట్లలో 4 స్థానాలను గెలుచుకున్న బీజేపీ
  • 2024లో 10 స్థానాలను గెలుచుకోలన్న పట్టుదలతో ముందుకు
  • పార్టీ శ్రేణులకు అమిత్‌ షా క్లాస్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. మీలో విభేదాలే పార్టీ కొంప ముంచాయని అన్నారు. అనుకున్న సీట్లు సాధించలేదని.. 30 సీట్లు వస్తాయని ఆశించామని పేర్కొన్నారు. వర్గ విభేదాల కారణంగానే నష్టపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌ షా.. హైదరాబాద్‌ లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్గ విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కలసికట్టుగా ఎక్కువ సీట్లు సాధించేందుకు పాటుపడాలన్నారు. వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని ముఖ్య నేతలకు అమిత్‌ షా వార్నింగ్‌ ఇచ్చారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయకండి.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలంటూ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా క్లాస్‌ పీకారు. పార్టీ ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశం హాట్‌హాట్‌ సాగింది. నేతల మధ్య గ్యాప్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది.. ఇది రిపీట్‌ కావొద్దంటూ షా హెచ్చరించారు. ఎంపీ టికెట్‌ ఆశావహులు, వారి బలబలాలపైన ఆరా తీసిన అమిత్‌ షా.. సిట్టింగ్‌ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చారు. నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. సిట్టింగ్‌ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తాం అని అమిత్‌ షా తెలిపారు. అంతకు ముందు శంషాబాద్‌ విమానాశ్రయంలో అమిత్‌ షాకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌ స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి నోవాటెల్‌ హోటల్‌కు చేరుకున్న అమిత్‌షా.. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపైనా ఆయన రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించారు. అంతకుముందు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు