Sunday, September 8, 2024
spot_img

సమస్యల వలయంలో అలంఖాన్‌ గూడ గ్రామం

తప్పక చదవండి
  • గ్రామంలో దోమల హంగామ.. పనిచేయని ఫాగింగ్‌ మిషన్‌ మా గ్రామాన్ని పట్టించుకునేది ఎవరు..?
  • శంకర్‌ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం అలంఖాన్‌ గూడ గ్రామంలో నిత్యం ఏదో సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉంది. అసలే వర్షాకాలం సిజ నల్‌ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు. గ్రామంలో హంగామ చేస్తున్న దోమలు. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్‌ మిషన్‌ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అది మున్నాల ముచ్చటగానే మా రింది. ఒకసారి మాత్రమే గ్రామంలో ఫాగింగ్‌ చేయడం జరిగింది. ఇప్పటివరకు దాని ఊసే లేదు. మరోవైపు కరెంటు సమస్య అసలే రాఖీ పౌర్ణమి బంధువులు వచ్చే వేళ, కరెంటు లేదు పండుగ వాతా వరణంలో ఉండాల్సిన ప్రజలు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరెంటు అధికారులకు ఫోన్‌ చేసిన ఎటువంటి స్పందన లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి కెసిఆర్‌ 24 గంటలు కరెం టు అంటున్నారు. కానీ కరెంటు అధికారులు మాత్రం 24 గంటలు కరెంటు ప్రజలకు ఇవ్వకుండా దుర్వినియోగం చేస్తు న్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గ్రామాలకు చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని గ్రామాల్లో ప్రవేట్‌ వాహనాల్లోనే చెత్త తొలగింపు కార్యక్రమం చేస్తు న్నారు. చెత్త వేసినందుకు ప్రజల దగ్గర నుండి 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు వసులు చేస్తున్నారు. ఇదేంటి అని అడిగితే నువ్వు డబ్బులు ఇస్తేనే మా బండిలో చెత్త వెయ్యండి లేక పోతే చెత్త వేయకుండి అని హేళనగా మాట్లాడుతున్నారు. కొంత మంది ప్రజలు మేము అలా డబ్బులు ఎందుకు ఇవ్వాలి మాకు ప్రభుత్వం ఉచితంగానే చెత్త సేకరణ వాహనం ఇప్పించింది మా గ్రామ పంచాయతీకి అని కొంతమంది ప్రజలు చెత్త వేయడం మానేశారు. ఇప్పటికైనా మా ఊరి సమస్యలు అధికారులు తక్షణ మే పరిష్కరించకుంటే ఈ విషయంపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని దమ్మన్నగారి శివ రెడ్డి( జర్నలిస్ట్‌ )అన్నారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను ఒక జర్నలిస్టుగా చేస్తున్నందుకు మా ఊరి ప్రజలంతా గర్వంగా భావించారు. కానీ మా ఊరి సమస్యల విష యానికి వచ్చేసరికి నేను దూరంగా ఉండడం ఏందని పలువురు ప్రశ్నించారు. నన్ను. ఏ సమస్య వచ్చినా ముందుండే వారు మీరు ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా మాకు పరిష్కారం చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలపై అధికారుల దృష్టికి తీసు కెళ్లిన మా గ్రామానికి ఎటువంటి న్యాయం జరగలేదు. రోడ్లు, డ్రైనేజీలు మాత్రమే మా ఊర్లో బాగున్నాయి. మిగతావన్నీ చూడ డానికి తప్ప ఉపయోగించుకోవడానికి పనికిరావని అన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మా గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కారం చేయాలని అధికారులను వేడుకున్నారు. గ్రామంలో దోమల హంగామ.. పనిచేయని ఫాగింగ్‌ మిషన్‌ మా గ్రామాన్ని పట్టించుకునేది ఎవరు..?
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు