Sunday, September 8, 2024
spot_img

మృత్యువుతో పోరాడి ఓడిన హోంగార్డ్

తప్పక చదవండి
  • అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • తన భర్త రవీందర్‌ను హత్య చేశారనన్న భార్య
  • హోంగార్డులు ఆందోళనకు దిగకుండా పోలీసుల చర్చలు
    హైదరాబాద్‌ : ఆత్మహత్యాయత్నం చేసుకొని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ శుక్రవారం ఉదయం మృతి చెందారు. 70శాతానికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్‌.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉన్నతాధికారుల వేధింపులు వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు మరణ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈక్రమంలోనే పోస్టుమార్టం నిమిత్తం రవీందర్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. హోమ్‌ గార్డు రవీందర్‌ మృతితో
    రవీందర్‌ చావుకు ముమ్మాటికీ కేసీఆర్‌ సర్కార్‌ దే బాధ్యత : బండి సంజయ్‌
    సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు.. రాష్ట్ర ప్రభుత్వం పై హత్యా నేరం కేసు నమోదు చేయాలి.. రవీందర్‌ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యలను బయటపెట్టాలి.. రవీందర్‌ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్‌ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలి.. రవీందర్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు వారిని అన్ని విధాలా ఆదుకోవాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోమ్‌ గార్డులకు అధికారుల వార్నింగ్‌ ఇచ్చారు. హోమ్‌ గార్డులు అందరూ డ్యూటీలో తప్పనిసరిగా ఉండాలని సూచించారు. డ్యూటీలో లేని హోమ్‌ గార్డులు తప్పనిసరిగా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉండాలని చెప్పారు. వీరంతా అందుబాటులో ఉండేలా ఇన్స్పెక్ట ర్లు చర్యలు తీసుకోవాలని.. లా అండ్‌ ఆర్డర్‌లో పనిచేసే వారు సమ్మెకు పూనుకుంటే విధుల నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. హోంగార్డు రవీందర్‌ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గత రెండు నెలల నుంచి రవీందర్‌కు జీతాలు రావడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి జీతం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి వివరించాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన రవీందర్‌ గోషామహల్‌లోని హోంగార్డుల హెడ్‌ ఆఫీస్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించు కున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పివేశారు. రవీందర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌కు 60 శాతానికి పైగా గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి మరింత విషమించడంతో కాంచన్‌ బాగ్‌ లోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వెంటిలేటర్‌ ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో శుక్రవారం ఉదయం అతడు మృతి చెందాడు. ఈ క్రమంలో హోంగార్డులెవరు రవీందర్‌ కుటుంబానికి మద్దతుగా ఆందోళనకు వెళ్లకుండా పోలీసలు చర్యలు తీసుకుంటున్నారు. హోంగార్డులందరూ డ్యూటీలో ఉండేలా చూసుకోవాలని సీఐలకు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలో లేని హోంగార్డులు తప్పనిసరిగా పోలీస్‌ స్టేషన్‌లో ఉండాలని ఆదేశించారు. హోంగార్డులు అందరూ అందుబాటులో ఉండేలా ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ లో పనిచేసే వారు సమ్మెకు పూనుకుంటే విధులనుంచి బహిష్కరణకు గురవుతారని.. ఎవరైనా విధులకు రాకుండా ఉంటే వాళ్లను తొలగించాల్సి వస్తుందని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హోంగార్డు రవీందర్‌ మృతిపై ఆయన భార్య సంధ్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తపై ఏఎస్సై నర్సింగరావు, కానిస్టేబుల్‌ చందు పెట్రోల్‌ పోసి తగలబెట్టారని ఆమె ఆరోపించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌ ఫోన్‌ను అన్‌ లాక్‌ చేసి డేటా డిలీట్‌ చేశారని సంధ్య తెలిపారు. నర్సింగరావు, కానిస్టేబుల్‌ చందులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. తన భర్తతో మాట్లాడాకే చంపేశారని.. ఘటనకు కారణమైన వారిని అరెస్ట్‌ చేయాలని సంధ్య డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన హోంగార్డు రవీందర్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు.
మరోవైపు.. హోంగార్డు రవీందర్‌ భార్య సంధ్య.. తన పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తన భర్తను ఆత్మహత్య కాదని.. ఉన్నతాధికారులు చేసిన హత్య అని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసారు. వేధించి, ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ కన్నీరు మున్నీరయ్యారు. తన భర్త ఫోన్‌ను తీసుకున్న పోలీసులు.. అందులోని డాటా మొత్తం డిలీట్‌ చేశారని సంధ్య చెప్తున్నారు. ఇందులో హోంగార్డ్‌ ఆఫీసర్‌ హైమద్‌ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. ప్రీప్లాన్డ్‌గా తన భర్తను చంపారని అంటున్నారామె. రవీందర్‌ కుమారుడు కూడా తన తండ్రి మృతికి ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్‌ చందూనే కారణమని చెప్తున్నాడు. మరోవైపు హోంగార్డు రవీందర్‌ మృతికి నిరసనగా.. హోంగార్డుల జేఏసీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఆయన కుటుంబానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. హోంగార్డులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేయబోతున్నారు. రవీందర్‌ మృతదేహంతో సచివాలయానికి వెళ్లాలని కూడా ప్లాన్‌ చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఆందోళనతో ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత కనిపిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హోం గార్డులు ఆందోళనకు దిగకుండా… ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. హోంగార్డులు అందరూ విధుల్లోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు.. ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల బాధ్యతలను ఎస్సైలకు అప్పగించారు. హోంగార్డులు అందరూ విధులకు హాజరయ్యేలా చూడాలని హుకుం జారీ చేశారు. విధులు కేటాయించని వారంతా పోలీస్‌ స్టేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు