Sunday, September 8, 2024
spot_img

బాధ్యతలు మరచిన ఏ.ఈ.రహీం..

తప్పక చదవండి
  • గుత్తే దారులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్న వైనం..
  • చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు..
  • చార్మినార్‌ జోన్‌, ఫలక్‌ నుమా సర్కిల్‌, దూద్‌ బౌలి డివిజన్‌లో వెలుగు చూసిన ఘటన..
  • అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త మహమ్మద్‌ అర్బాజ్‌..
    ఎన్నిమార్లు జీ.హెచ్‌.ఎం.సి.లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుకున్నా.. కథనాలు రాసినా ఎలాంటి మార్పులు కానరాక కలం సిగ్గుపడుతోంది.. ఎప్పటికప్పుడు జరుగు తున్న అవినీతిని వెలుగులోకి తెస్తున్న పత్రి కలు కూడా అలసిపోతున్నాయి.. కానీ అవినీతి అధికారులలో గానీ, నియంత్రి ఉన్నతాధికారులలో గానీ చలనం లేకపోవడం శోచనీయం.. జీ.హెచ్‌.ఎం.సి., చార్మినార్‌ జోన్‌, ఫలక్‌ నుమా సర్కిల్‌, దూద్‌ బౌలిలో ఏ.ఈ.గా విధులు నిర్వహిస్తున్న ఎం.ఏ. రహీం అవినీతి భాగోతం వెలుగు చూసింది.. వివరాలు చూద్దాం..
    హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని, చార్మినార్‌ జోన్‌, ఫలక్‌ నుమా సర్కిల్‌, దూద్‌బౌలి డివిజన్‌ లో ఏ.ఈ. గా విధులు నిర్వహిస్తున్న ఎం.ఏ. రహీం బాధ్యత గల హోదాలో ఉండి.. స్వార్థ ప్రయోజనాల కోసం నాణ్యతా ప్రమాణాలు పాటించ కుండా.. గుత్తే దారులతో లోపాయకారి ఒప్పందాలు చేసుకొని, అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మహమ్మద్‌ అర్బాజ్‌ అనే సామాజిక కార్యకర్త, బంజారాహిల్స్‌ లోని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
    సదరు ఏ.ఈ. ఆధ్వర్యంలో జరిగిన నాసిరకం
    పనుల వివరాలు మచ్చుకకు కొన్ని :
  1. బాక్స్‌ టైప్‌ డ్రైన్‌ ఆర్‌.సి.సి. – ట్రాన్ఫర్మర్‌ నెంబర్‌ : 1611080082/18 నుండి మురళీ నగర్‌ వరకు.. టెండర్‌ ఐడీ నెంబర్‌ : 205033.. టెండర్‌ విలువ
    రూ. 81,92,329.
  2. సీసీ రోడ్‌ నిర్మాణం – ఆర్‌.ఎం.సి. దగ్గర లోని లిమ్రా వ్వాటర్‌ సప్లై నుండి అల్లాప్‌ా హందుల్లా చికెన్‌ సెంటర్‌, ఉస్మాన్‌ బాగ్‌, దూద్‌ బౌలి వరకు..
  3. రీ మోడలింగ్‌ ఆఫ్‌ ఎస్‌.డబ్ల్యు. డ్రైన్‌ 900 ఎం.ఎం. డయా, సీసీ ప్యాచ్‌, ప్రోవైడిరగ్‌ ఆర్‌.సి.సి. స్లాబ్‌ నుండి ఓపెన్‌ నాలా పాలెటెక్నీక్‌ కాలేజీ వరకు, మెయిన్‌ రోడ్‌, దూద్‌ బౌలి..
  4. బాక్స్‌ టైపు డ్రైన్‌ (ఆర్‌.సి.సి.) నిర్మాణం – ట్రాన్స్‌ ఫార్మర్‌ నెంబర్‌ : 1611080075 నుండి మురళీ నగర్‌ లోని ఎలెక్ట్రికల్‌ పోల్‌ నెంబర్‌ : 1611080082/18.. దూద్‌ బౌలి వరకు..
    విషయం ఏమిటంటే.. కాంట్రాక్టర్లకు అప్రూవల్‌ ఎస్టిమేషన్‌ ప్రకారము పనులను చేయకున్నా.. మెజర్మెంట్‌ బుక్‌ లో తప్పుడు మెజర్మెంట్లు నమోదు చేసి.. బిల్లులను సర్దుబాటు చేయడంతో వచ్చిన అవినీతి సొమ్ములో నుంచి సీనియర్‌ను అధికారులకు సైతం కొంత భాగాన్ని సదరు రహీం చెల్లించేవాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇతగాడు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతున్నా లెక్కచేయకుండా ఓ ప్రణాళిక బద్ధంగా బిల్లులను జారీ చేయడం అలవాటుగా మార్చుకొని జారీ చేసేవాడని తెలుస్తోంది.. సాంకేతిక అనుమతి ప్రకారం సీసీ రోడ్డు పనులు అమలు చేయకపోవడంతో.. ఆచేసిన పని నాణ్యత లేకపోవడం వలన పని యొక్క కాల వ్యవధి తగ్గిపోవడంతో పాటు, దుమ్మును వెదజల్లుతుంది.. డ్రైన్‌ బాక్స్‌, రోడ్లపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. సాంకేతిక పరంగా బాక్స్‌ డ్రైన్‌ పనుల యొక్క లోతును గాని, పొడవును గాని ఎప్పుడూ పరిశీ లించిన దాఖలాలు లేకపోవడం అతని నిర్లక్ష్యానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్‌ సిటీని గోల్డ్‌ సిటిగా తీర్చిదిద్దడానికి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులను చేపట్టాలని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తే.. బాధ్యత గల అధికారులు ఓ ప్రణాళిక బద్ధంగా.. గుత్తే దారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలను చేయని పనులకు చేసినట్లు కల రింగ్‌ ఇస్తూ… దొంగ బిల్లులకు ఆమోదముద్ర వేసి, ప్రభుత్వ సొమ్మును కాజేయడం బాధా కరం. ఇప్పటికైనా ఉన్నతా ధికా రులు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌ రహీంపై, అతనికి సహకరించిన ఉన్నత అధికా రులపై సమగ్రంగా విచారించి.. కఠిన చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త కోరుతున్నాడు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు