Sunday, September 8, 2024
spot_img

25000 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి..

తప్పక చదవండి
  • తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జే ఏ.సీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణు కుమార్..

    హైదరాబాద్ : విద్యను పేదలకు ఉచితంగా అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలది ఓట్ల గారడి తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వఆస్తులను అతి తక్కువ ధరలతో కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ.. ప్రజలకు సంక్షేమ పథకాల స్కీముల ఆశ చూపించి అధికారoలోకి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో విద్యావ్యవస్థ మెరుగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో ఉద్యోగ నియామకాలు రిక్రూట్ మెంట్ జరగాలి అని అన్నారు. రాష్ట్రంలో 25వేల పైచిలుకు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కొన్ని సర్వేలు, పీ.అర్.సీ. రిపోర్ట్ కమిటీ చెప్పింది.

అంతేకాకుండా శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 15 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా అన్నారు. తెలంగాణ ప్రాథమిక పాఠశాలలో 18000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పుకున్నారు. తెలంగాణ ఉన్నతాధికారుల దగ్గరికి వచ్చిన రిప్రజెంటేషన్లు లో కూడా 25 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం దగ్గర రిపోర్టులు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 5000 వేల టీచర్ ఉద్యోగాలు ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉన్నది అన్నారు. రాష్ట్రంలో25 వేల పైగా టీచర్ ఉద్యోగాల నియామకాలు ఖాళీగా ఉంటే దానిలో 4వ వంతు కూడా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం శోచనీయం అని అన్నారు. ఇది కే.సీ.ఆర్. కి పేద విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. తెలంగాణలో కొన్ని గ్రామాలలో ఆ ఊరి గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు చందాలు వేసుకొని టీచర్లను నియమించుకుంటున్నారని అన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల రెండు సెక్షన్లుగా విభజించారు, కానీ ప్రభుత్వం సెక్షన్లకు ఇస్తా అన్న టీచర్లను ఇవ్వకుండా అధ్యాపకుల పైన పని ఒత్తిడి భారం పెరిగిపోతుందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఒకరిద్దరూ ఉపాధ్యాయులతో మండల పరిషత్, గిరిజన సంక్షేమ ప్రాథమిక,ప్రభుత్వ పాఠశాలలు మనగడను కోల్పోతున్నాయి. పాఠశాల విద్యలో 5 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు 5 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పే గురుకులాలను చూపించి, మిగతా పాఠశాలలని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలో ఇంగ్లీష్, మ్యాథ్స్,సైన్స్ చెప్పే టీచర్స్ లేక విద్యార్థుల లో బేసిక్ ప్రమాణాలు తగ్గిపోయి జాతీయస్థాయి పరీక్షలకు పోటీ పడలేకపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 25000 టీచర్ ఉద్యోగ పోస్టులకు డీ.ఎ.స్సీ నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలని మండల, జిల్లా, పరిషత్, గిరిజన సంక్షేమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రంలో ప్రజా సంఘాలను, కలిసి వచ్చే సంస్థలను, పూర్వ విద్యార్థి కమిటీలు, విద్యా వంతులను విద్యార్థి, నిరుద్యోగ యువజన సంఘాలను, కలుపుకొని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు