Friday, April 26, 2024

సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి సత్కారం..

తప్పక చదవండి

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఘనంగా సన్మానించారు. బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు, డైరెక్టర్‌ రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని బాహుబలితో కీర్తిని దేశవ్యాప్తం చేస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ఆస్కార్ సాధించినందుకు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి సినిమాల్లో ఇన్‌స్పిరేషన్‌.. దేశ భక్తి, సామాజిక స్పృహ కనిపిస్తుందన్నారు. ఆయన భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. అంతకు ముందు రాజమౌళి మాట్లాడుతూ హరీశ్‌రావు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సిద్ధిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తాను చూసిన నాటికి.. ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు. పనితీరు చూసిన నాటి నుంచి హరీశ్‌రావుకు తాను పెద్ద అభిమానిగా మారానని రాజమౌళి చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు