Friday, April 26, 2024

అవినీతి మహిళా అధికారికి అండ ఎవరు..?

తప్పక చదవండి
  • కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయని అధికారులు..
  • ఈవిడపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారు..?
  • నల్గొండ జిల్లా, కట్టంగూరు కె.జీ.బీ.వీ. ప్రత్యేక అధికారి
    యం. నీలాంబరి అవినీతి భాగోతంపై ‘ఆదాబ్’ కథనం..

నా పేరు నీలాంబరి.. నేను ఎవరిమాటా వినను.. నేను అనుకున్నదే జరగాలి.. నా దారికి ఎవరొచ్చినా సహించను.. అంటూ ఓ సినిమాలో నీలాంబరి పేరుగల పాత్రధారి చెప్పిన డైలాగ్ కు ప్రేక్షకులు చప్పట్లు కొట్టి మరీ స్పందించారు.. అదే కోవలో పయనిస్తున్న ఓ మహిళా అధికారి యం. నీలాంబరి..చేస్తున్న నిర్వాకంపై వాస్తవాలు మీముందుకు.. నల్లగొండ జిల్లా, కట్టంగూరు కె.జి.బి.వి. ప్రస్తుతం ప్రత్యేక అధికారిగా పని చేస్తున్న యం. నీలాంబరి.. గతంలో కేతేపల్లి కె.జి.బి.వి.లో నకిలీ బిల్లులు పెట్టి దాదాపు రూ.1,57,786/-లు ప్రభుత్వ సొమ్మును కాజేసినందున అవినీతి ఆరోపణలతో బదిలీ చేసినందుకు.. తన స్థానాన్ని కాపాడుకోవాలనే దురాలోచనతో విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి పాఠశాలకు 0.5 కి.మీ. దూరంలో ఉన్న జాతీయ రహదారిపైకి వచ్చి ధర్నా చేయుటకు విద్యార్థినిలను ప్రోత్సహించినారు. ఇట్టి విషయంలో కేతేపల్లి మండల విద్యాధికారి, సెక్టోరియల్-3 అధికారి, పోలీస్ వారు, కేతేపల్లి తహశీల్దారు పలుమార్లు నచ్చచెప్పినప్పటికీ, అధికారులు బదిలీ ఉత్తర్వులను లెక్కచేయకుండా, ధర్నా విరమించకుండా జాతీయ రహదారిపై ధర్నా చేయించినా కూడా.. తూతూ మంత్రంగా నామమాత్రపు విచారణ చేసి, ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులపై అదే విధంగా ప్రస్తుతం కట్టంగూరు కె.జి.బి.వి. లో డీసీడీఓ, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సెక్షన్ అధికారుల అండదండలతో అడ్డూ అదుపు లేకుండా నిరంకుశ దోరణిలో నియంతగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులకు సరైన ఆహారం పెట్టకుండా.. విద్యార్థులను వేధిస్తోంది స్పెషల్ ఆఫీసర్ నీలాంబరి.. ఈవిడ చేస్తున్న అరాచకాలపై, ఈవిడ వెనకాల ఉన్న బడా బాబుల గురించి.. స్వయానా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఈవిడపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై అసలు నిజాలను వాస్తవాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు