Saturday, April 27, 2024

అంతర్జాతీయ స్థాయికి ఉన్నత విద్య ప్రమాణాలు, కోర్సులు

తప్పక చదవండి

విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. ఆర్. లింబాద్రి

హైదరాబాద్ : దేశంలో ఉన్నత విద్యా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లాలని.. ఇందుకోసం అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. ఆర్. లింబాద్రి అభిప్రాయ పడ్డారు. దేశంలో తెలంగాణ రాష్ట్ర గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అత్యధికంగా ఉందన్న ఆయన విద్యారంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్-నీపాలో జరిగిన సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ యాదవ్తో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల ఛైర్మన్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఒక హాఫ్ ఇయర్లీ ఈ న్యూస్ లెటర్ తీసుకు రావాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన విషయాలపై చర్చించిన వివిధ రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల ఛైర్మన్ల సమన్వయంతో సెప్టెంబర్లోపే ఈ న్యూస్ లెటర్ తీసుకు రానున్నట్లు తెలిపారు. భవిష్యత్లో ఉన్నతవిద్యామండళ్లలో నీపా మరియు విశ్వవిద్యాలయాల సమన్వయంతో సదస్సులు, వర్క్షాప్లు నిర్వహించి దేశంలో ఉన్నత విద్య బలోపేతానికి కృషి చేయాలని తీర్మానించారు. అలానే ఉన్నతవిద్య అంతర్జాతీయకరణకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు, భవిష్యత్లో విద్యార్థుల ప్రయోజనం కోసం తీసుకు రావాల్సిన కోర్సులు, కరికులానికి సంబంధించిన అంశాలపై లోతుగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ. ఆర్. లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. దండెబోయిన రవీందర్ యాదవ్తో పాటు నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నీపా న్యూదిల్లీ ఉపకులపతి ప్రొ. శశికళ వంజరి, నీపా ఉన్నత విద్యా విభాగాధిపతి ప్రొ. సుధాంశు భూషణ్, నీపాకు చెందిన మరికొందరు అధ్యాపకులు ప్రొ. ప్రదీప్ మిశ్రా, ప్రొ. గరిమా మాలిక తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు