Sunday, September 8, 2024
spot_img

ఎన్నికలలో విజయము సాధించుటకు పోటీదారులు చేయవలసినఅతి ముఖ్యమైన, అత్యావశ్యకమైన కార్యక్రమములు..

తప్పక చదవండి
  • సూచనలు చేస్తున్న శ్రీ రుద్రపీఠం …. దేవముని దేవదైవజ్ఞ

హైదరాబాద్, 22 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఎన్నికలలో విజయమును సాధించవలెనంటే మొట్టమొదట మీరు వుండే ఇంటి వాస్తులో ఎలాంటి దోషములు లేకుండా సరిచేసుకోవడం ఎంతో అవసరం. మీరు ఉండే ఇంటి దోషం మీ అభివృద్ధికి ఎంతో ఆటంకమును కలిగిస్తుంది.. ఈ ఆటంకమును తొలిగించుకొని ఆ తరువాత ముందుకు ప్రయాణం చేయాలి.. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగములు చేసినా వాటి ఫలితమును మీ ఇంటి వాస్తు దోషము సంపూర్ణముగా హరించి వేస్తుంది.. కావున మొట్టమొదటి మీ ఇంటి గృహవాస్తును సరిచేసుకోవడం ఎంతో అవసరం.. ఇంటి వాస్తును సరిచేసుకొనిన తరువాత మీ ఇంటి ఏ యాగము చేసిననూ ఆ యాగ ఫలమును మీరు సంపూర్ణముగా పొందుతారు..

మహాభారత యుద్ధమునకు ముందు అర్జునుడు విజయదుర్గా యాగమును చేసి అమ్మవారి ఆశీర్వాదమును పొంది యుద్దములో విజయమును పొందిన విధముగా మీరు కూడా ఎన్నికలు అనే యుద్ధంలో విజయాన్ని పొందుటకు ఈ యాగములు చేసుకొనుట ఎంతో అవసరం..

- Advertisement -

ఇంతే కాకుండా ఎన్నికలలో పార్టీ సీటును పొందడానికి, ఎన్నికలలో విజయమును సాధించడానికి, మంత్రి పదవిని పొందడానికి, మంత్రి పదవి ష్ఠిరముగా ఉండడానికి, విపక్ష నాయకుల నోరు మూయడానికి, శత్రు స్తంభనకు, శత్రు ముఖ స్తంభనకు, శత్రు గతి మతి స్థితి స్తంభనకు, శత్రు నాశనమునకు, అపార ధనప్రాప్తికి శ్రీ బగళాముఖి అమ్మవారి అనుగ్రహము ఆశీర్వాదమును పొందుట ఎంతో అవసరం..

కావున ఎన్నికలలో పోటీ పడేవారు శత్రుమూక స్తంభనకు, శత్రుంజయమునకు, ఆర్థికాభివృద్ధికి, సర్వవిధ అభివృద్ధికి బగళాముఖీ మూల మంత్ర జపము, బగళాముఖియాగము, బ్రహ్మాస్త మంత్ర జపము, యాగము మరియు బగళాముఖీ మాలామంత్రజపము, యాగము చేసుకొనుట లేదా చేయించుకొనుట అత్యావశ్యకము.. రాజకీయనాయకులు రాజకీయాలలో ష్ఠిరముగా వుంది ఎల్లప్పుడూ మంత్రి పదవులను పొందుతూ వుండాలనుకొనేవారు బగళమ్మ వారి అనుగ్రమమును పంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటు కీర్తి ప్రతిష్టలను కూడా పొందగలరని ఆశిస్తూ.. ఆశీర్వదిస్తున్నారు శ్రీ రుద్రపీఠం.. దేవముని దేవా దైవజ్ఞ.. సంప్రదించండి : 9346053953..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు