Featuredస్టేట్ న్యూస్

పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు. – యువత ఓటు వేసి ప్రశ్నించాలి.

– మనం ఓటు వేస్తేనే మార్పు సాధ్యమవుతుంది..

– యాక్‌ సంస్థ ఓటుపై అవగాహన కల్పించాలి..

– యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సమావేశంలో

– సిబిఐ మాజీ జెడి లక్ష్మినారాయణ..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌: మనిషికి డబ్బు ప్రాధాన్యం పెరగడంతో అధికారం, పదవుల కోసమే నేడు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారని, అలాంటి వారు ప్రజలకు ఏలా సేవచేస్తారని సిబిఐ మాజీ జెడి లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం ఇండియన్‌ మెడికల్‌ ఆసోసియేషన్‌లో యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ నిర్వహించిన అవినీతి రహిత ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ వ్యవస్థాపకులు పల్నాటి రాజేందర్‌ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిధిగా హజరై మాట్లాడారు. మనిషి ప్రతిరోజు ఆనందంగా గడపాలి. కాని నేడు ప్రతిరోజు భయంతో బతుకుతున్నాము. ప్రతి సంవత్సరాలకొకసారి ఎంతోమంది ఎన్నికవుతున్న శాసనసభలో ముగ్గురిని అవినీతి రహిత ప్రజాప్రతినిధులని సన్మానించుకుంటున్నాము. అంటే నిజాయితీగా పనిచేసేవారు రోజురోజుకు కరువవుతున్నారని తెలుస్తుంది. సమాజంలో ఎవరిదగ్గర డబ్బుంటే వారు అధికారం దాహంతో రాజకీయాల్లోకి వస్తున్నారు. డబ్బులు ఇస్తునే ఓటు వేస్తున్నాము అంటున్నారు కాని డబ్బులు మొదట డబ్బుల ఆశచూపిందే రాజకీయనాయకులు.. అందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పాను. ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే కానిదీ లేదన్నారు. లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ రాజకీయాల్లోకి వచ్చారు ఆయన విఫలం అయ్యారు. మీరు కూడా సక్సెస్‌ అవుతారో, లేదో అని అన్నారు. కాని ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాన్ని మీరు అర్థం చేసుకోలేదని, అలాంటి మంచివాళ్లను మీరు దూరం చేసుకున్నారని అది ఓటర్ల తప్పేనన్నారు. ఓటు వేసే ముందు ఒకటికి, పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు. అప్పుడే మంచివారు చట్టసభల్లోకి వస్తారన్నారు. యువత మారాలి, యువత ముందుకు రావాలి. యువత ఆలోచనలతోనే మార్పు వస్తుంది. కులాలు, మతాలు, ప్రాంతాలతో రాజకీయనాయకులు ఓటర్లను రెచ్చగొడుతున్నారు. వారి ప్రలోభాలకు లంగకూడదన్నారు. చాలా ప్రాంతాలలో ఓటింగ్‌ శాతం కూడా రోజురోజుకు తగ్గిపోతుందన్నారు. 65శాతం మాత్రమే పోలింగ్‌ అవుతుందని, ఇంకా ముప్పై శాతం ఓట్లు పోలు కావడంలేదన్నారు. ఓటుకు ఎక్కువగా దూరం ఉంటుంది చదువుకున్నవారేనన్నారు. ఓటు యొక్క విలువపై అవగాహన కల్పిస్తూ వారిని పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే బాధ్యత యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ తీసుకొవాలన్నారు. పీపుల్స్‌ మేనిపెస్టో కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలన్నారు. ఓట్లు కావాలని మీ ముందుకు వచ్చేవారికి, మా గ్రామనికి ఏం చేస్తావు లాంటి పత్రం వారికి ఇచ్చి, వాటిపై సంతకం చేయించుకోవాలన్నారు. అవసరమైతే బాండ్‌ పేపర్‌పై రాపించుకోవాలని అప్పుడే వారికి భయం, మనకు ప్రశ్నించే అవకాశం రెండూ ఉంటాయన్నారు.

రాజకీయనాయకులతో సహా ఐఎఎస్‌, ఐపిఎస్‌లు అధికారులందరూ ప్రజలకు సేవకులని, వారితో సేవ చేయించుకోవాలన్నారు. మన ఇంట్లో పనిమనిషి సరిగ్గా పనిచేయకుంటే వారిని ఏలా భయపెట్టి దగ్గరుండి పనిచేపిస్తామో, మన నాయకులను, అధికారులను కూడా ప్రశ్నించి మరీ పనులు చేయించుకోవాలన్నారు. మంచి అభ్యర్థిగా పోటిచేసే వారికి యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ మద్దతు పలుకాలన్నారు. చిన్న చిన్న వీడియోలతో ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యం పరచాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌సంస్థ తరపున యువతకు అవగాహాన కల్పిస్తూ పోటిలోకి దింపాలన్నారు. మహారాష్ట్రలో సిఎంగా పోటీ చేయాలన్నా ముందుగా స్థానిక సంస్థలో పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలన్నారు. మనం కూడా అలాంటి పద్దతి కోసం పోరాటం చేయాలన్నారు. ఆనంతరం అవినీతి రహిత ప్రజాప్రతినిధులు గుమ్మడి నర్సయ్య, కుంజ బజి, కొండిగారి రాములకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్చీవ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆకునూరి మురళి, ఆదాబ్‌ హైదరాబాద్‌ ఎండి వీరమల్లు సత్యం, యుఎఫ్‌ఆర్‌టిఐ అధ్యక్షుడు మామిండ్ల మహేష్‌, యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ అధ్యక్షులు వాసిరెడ్డి గిరిధర్‌, కొన్నె దేవేందర్‌, కార్యవర్గసభ్యులు బత్తిని రాజేష్‌, వలబోజు అంజుకర్‌, వరికొప్పుల గంగాధర్‌, కోమటి రమేష్‌బాబు, హరిప్రకాష్‌, యాక్‌ సలహాదారులు దన్నెబోయిన అశోక్‌కుమార్‌, డాక్టర్‌ రవిశంకర్‌, గంధం లక్ష్మి, మహిళా కార్యవర్గసభ్యులు మాదినేని కళ్యాణచౌదరి, పోతినేని రాజేశ్వరి, సారా, మారియా అంతోని, భవాని, సైనిక, జిల్లాల నాయకులు సూర రాజేందర్‌, చెరుకూరి జంగయ్య, పంబిడి శ్రీధర్‌రావు, మేడికొండ వెంకట్‌రెడ్డి, జనగాం బాబురావు, కోకిల శ్రీరంగం, పోలెపాక కుమారస్వామి, ప్రవీణ్‌, శ్రీనువాస్‌ తదితరులు పాల్గన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close