యువత అద్భుతాలు సృష్టించాలి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): యువత అద్భుతాలు సృష్టించాలని, సుధీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సామాజిక వేత్త అన్నా హజారే పిలుపునిచ్చారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరుగింది. ఈ సదస్సును శనివారం జాగృతి అధ్యక్షురాలు కవిత, అన్నాహజారేలు కలిసి జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో అన్నా హజారే మాట్లాడుతూ.. యువత పట్టుదలతో ముందుకుసాగి అద్భుతాలు సృష్టించాలని అన్నారు. ఏడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని చెప్పారు. జీవింతలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే మనల్ని దేవుడు ఇక్కడికి పంపారు. భగవంతుడు పుణ్యక్షేత్రాల్లోనే కాదు.. అన్ని చోట్లా ఉంటాడు అని అన్నా హజారే తెలిపారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకు మనం సృష్టించుకున్నవే అని తెలిపారు. ప్రపంచంలో ఏటా 22వేల మంది చిన్నారులు చనిపోతున్నారని, సుస్థిర అభివృద్ధికి ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన వల్ల ఉద్భవించిన కొన్ని సమస్యలకైనా ఈ సదస్సులో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. యువత కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని కవిత పేర్కొన్నారు. యువత మంచి ఆలోచనలతో, సమాజహితం కోసం ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ జాగృతి కార్యక్రమంలో అసదుద్దీన్‌

టీఆర్‌ఎస్‌-ఎంఐఎం దోస్తీ తర్వాత ఈ రెండు పార్టీల నేతల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగాయి. తాజాగా కేసీఆర్‌ కుమార్తె, నిజామాబాద్‌ ఎంపీ కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌ ¬టల్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ మాట్లాడుతూ..49 సంవత్సరాల వయస్సులోనూ యువ నాయకుడిగా పేరొందుతున్నానన్నారు. యువత అభివృద్ది చెందాలంటే పాలసీ మేకర్లలో యువప్రాతినిధ్యం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటే.. నలుగురిలో ఆలోచన రేకెత్తించడానికేనని అసదుద్దీన్‌ తెలిపారు. తన దృష్టిలో మహాత్మాగాంధీ కన్నా అంబేద్కర్‌ గొప్ప వ్యక్తని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీల్లో చేరితే ఉన్నత స్థానాలకు ఎదగలేరని, రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగాలంటే ఎమ్మెల్యే, ఎంపీ అర్హత వయస్సు 20 ఏళ్లకు తగ్గించాలన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సామాజిక వేత్త అన్నాహజారే మాట్లాడుతూ.. ఏడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్బుతాలు సృష్టించాలని అన్నాహాజారే ఆకాంక్షించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా యువత వెనుకడుగు వేయ్యొద్దని పిలుపునిచ్చారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here