నగరంలో యూత్‌ లీడర్‌ షిప్‌ కాన్ఫరెన్స్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వరకు అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సును నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ నోవాటెల్‌ ¬టల్లో ఈ సదస్సు జరగనుంది. 19వ తేదీన ప్రారంభ సమావేశానికి అన్నా హజారే ముఖ్య అతిథిగా హాజరవుతారు. నిజామాబాద్‌ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీనోట్‌ అడ్రస్‌ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జరిగే ముగింపు సమావేశానికి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. శనివారం ఎంపి కవిత సదస్సులో పాల్గొనాలని రాజ్భవన్కు వెళ్లి ఆహ్వానించారు. మొదటి రోజు యువత అభివృధ్ధి పై ప్రముఖ జర్నలిస్ట్‌ శేఖర్‌ గుప్తా చర్చా గోష్టిని నిర్వహిస్తారు. పది వేర్వేరు హాళ్లలో వేర్వేరు అంశాలపై చర్చా గోష్టులు జరుగుతాయి. ప్రంపచ ప్రగతిలో యువత పాత్రపైనా యువ నాయకులు మాట్లాడతారు. రెండో రోజు నైపుణ్య శిక్షణ, సమతులాభివృద్ధిలో యువత, మహిళల పాత్ర, కార్పోరేటు,ప్రభుత్వాల భాగస్వామ్యం పై చర్చిస్తారు. వీటిని అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో నిష్టాతులు నిర్వహిస్తారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు అంశంపై సదస్సులో చర్చిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. 2030 వరకు భవిష్యత్‌ మానవాళి మనుగడకు అవసరమైన ప్రాథమిక లక్ష్యాలను సాధించేందుకు ఐక్యరాజ్య సమితి విడుల చేసిన 17 అంశాల లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణ జాగృతి ఈ అంతర్జాతీయ సదస్సు ను నిర్వహిస్తున్నదని ఆమె వివరించారు. 103 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. 16 దేశాల నుంచి 70 మంది వక్తలు, 40 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని ఎంపి కవిత చెప్పారు.

ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 లక్ష్యాలు

  1. పేదరిక నిర్మూలన
  2. ఆహార సమృద్ధి
  3. ఆరోగ్యం
  4. నాణ్యమైన విద్య
  5. లింగ సమానత్వం
  6. మంచి నీరు-పరిశుభ్రత
  7. పర్యావరణ అనుకూల విద్యుత్‌
  8. గౌరవప్రదమైన పని, ఆర్థికాభివృద్ధి
  9. పరిశ్రమలు, మౌళిక వసతులు, నూతన ఆవిష్కరణలు
  10. అన్ని రంగాల్లో సమానత్వం

11.పర్యావరణ అనుకూల నగరాలు, గ్రామాలు

  1. బాధ్యతాయుతమైన వనరుల వినియోగం

13.వాతావరణంలో మార్పులు-మానవాళి బాధ్యత

  1. సముద్ర జీవుల సంరక్షణ
  2. భూచరాల జీవనానికి అనుకూల వాతావారణంకు కృషి
  3. శాంతి, న్యాయం దిశగా పటిష్ట వ్యవస్థల ఏర్పాటు
  4. పై లక్ష్యాల కోసం వ్యవస్థలు, దేశాల పరస్సర సహాకారం

దేశం గర్వపడేలా కెసిఆర్‌ పాలన

ఎన్నారై పాలసీ తీసుకుని వస్తామన్న కవిత

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా ఉందని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఎన్నారై పాలసీ విూద టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పని చేస్తున్నారని.. త్వరలో పాలసీని తీసుకువస్తామని వెల్లడించారు. ప్రస్తుతం 33 దేశాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతోందని.. రాబోయే రోజుల్లో వందకుపైగా దేశాల్లో గులాబీ జెండా ఎగిరేలా పని చేస్తామన్నారు. తెలంగాణ భవన్‌ లో ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే సెల్‌ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, బేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌, యూకే సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలంతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఇప్పటికే 33 దేశాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతున్నదని తెలిపారు. ఎన్ని కష్టాలున్నా టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖను ముందుకు తీసుకెళ్లారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నారై పాలసీ విూద కేటీఆర్‌ పని చేస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖతో కలిసి త్వరలో ఎన్నారై పాలసీ తీసుకొస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో యావత్‌ తెలంగాణ జాతి గర్వపడేలా పని చేద్దామని కవిత పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here