Featuredస్టేట్ న్యూస్

సన్యాసులుగా మారుతున్న యువత…

బంధాలు.. అనుబంధాలు.. అనురాగాలు.. ఆత్మీయతలు.. అన్ని బరువైపోతున్నాయి.. అధ్యాత్మిక జీవనం వైపే మనిషి మన సు అడుగలేస్తోంది.. రోజురోజు మారుతున్న బిజీ జీవితానికి అలవాటు పడలేక.. క్షణక్షణం మనశ్శాంతి కరువై, నిద్రలేమి రాత్రులు గడుపుతూ.. ఒత్తిడి జీవనాన్ని భరించలేక… అడవులవైపే, నాగ సాధువులుగా మారడమే సరియైన మార్గమంటూ ఉన్నత చదువులు చదివిన యువత సన్యాసులుగా మారుతున్నారు.. క్షణం జీవితానికి ఆనందం లేనప్పుడు, కోట్ల సంపా దనకు ప్రశాంతత లేనప్పుడు.. సాధువుగా మారుతూ, సన్యాసిగా జీవించడమే సరియైన మార్గమంటున్నారు నేటి యువ తరం… చదువు రాని వారు.. బతకడం తెలియని వారే, సంపాదించడం చాతకాని వారే సన్యాసులుగా మారు తున్నారను కుంటే చాలా పొరపాటు… కుంభమేళాలో జరుగుతున్న మహ సంద్రంలో ఒక్కరోజే పదివేల మంది పట్టభ ధ్రులు, ఉన్నత ఉద్యోగులు బంధాల, బాంధవ్యాన్ని వదిలేసి ప్రశాంత జీవనం కోసం సాధువులుగా మారిపోయారు… అడ వుల్లో తిరుగుతూ ఆకులు, అలుములు తింటూ, చిన్న పాటి గోసి కట్టుకునే జీవనానికే మొగ్గుచూపేందుకే సిద్దమయింది ఈ తరం….

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

పల్నాటి రాజేందర్‌ ఆదాబ్‌ ప్రత్యేక ప్రతినిధి

మనిషి జీవితం నిత్యం సంఘర్షణలమయం.. ఎంత సంపాదించినా, ఎంత పనిచేసినా, రెక్కలు ముక్కలు చేసుకున్నా ఇంకా ఏదో వెలితి ఉంటుంది. ఇంకా ఇంకా ఏదో కావాలని పరితపిస్తాడు. కోట్లు సంపాదించినా మనశ్శాంతే లేదంటాడు… డబ్బుంటేనే ఆనందం కాదు, దానికి తగ్గట్టుగా అధికారం కావాలంటాడు. మనిషి జీవితమే కోరికలమయం అన్నాడు గౌతమ్‌ బుద్దుడు… అందుకే ఆయన ఆనాడు త్యజించి సన్యాసిగా మారిపోయాడు. ఒకటి పోగానే మరో కోరిక వస్తుందని భావించాడు, ఈ కోరికలకు అంతమనేది లేదని చెప్పాడు… ఆ రోజు బుద్ధుడు ఏం చెప్పాడో గాని ఈ రోజుల్లో మాత్రం ఉన్నత చదువులు చదివిన యువత మాత్రం ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, కోరికలు మా వల్ల కాదంటున్నారు.. ఒకటి పోగానే, మరోకటి వస్తుంది. అందుకే మనసు అదుపులో ఉండని ఈ జీవితంలో క్షణకాలం కూడా తృప్తి అనేదే లేదు. ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా, జీవితంలో ఇంకా వెలితే ఉంటుంది. అందుకే మనసుకు శాంతికోసం మనిషి తిరుగుతూ ఉన్నాడు. మనశ్శాంతి మనిషి మనుసులో ఉందని అందుకే ఈ బంధాలు, బధుత్వాలు వదిలేసి సన్యాసిగా మారడమే సరియైన మార్గమని నమ్మిన మానవుడు నేడు సాధువులుగా మారేందుకు సిద్దమవుతున్నారు. సాధువులా మారాలంటే భవబంధాలు, ప్రేమానురాగాలు, బంధుత్వాలను వదిలిపెట్టాల్సి రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన వారినే సాధువులుగా మారుస్తున్నారు. ఒకసారి సాధువుగా మారాక వారి కామ, క్రోధ, మద వాత్సాల్యాలకు దూరంగా ఉండాల్సిందే.. సాధువు స్వీకరించాక వారు హిమాలయాలు, గుడులు, గోపురాల వెంటే ఉంటూ జీవితాంతం భగవంతుడి ధ్యాసలోనే బతకాల్సి ఉంటుంది. అలాంటి జీవితం మొదట్లోనే కఠినమైన రోజరోజుకు వారు తిరిగే ప్రదేశాలు, వినే మాటలు, చూసే చూపులను బట్టి వారిలో మార్పు వస్తుంది. నిత్యం సంఘర్షణల జీవితాన్ని భరించలేకనో, ఉద్యోగాల ఒత్తిడినో, కుటుంబ సభ్యులు, ఇతరత్రా బిజీ లైప్‌తోనే యువతరం ఇలా సాధువులుగా మారుపోతున్నారని తెలుస్తోంది. యువత ఆధునిక పోకడలకు అలవాటై అవి నెరవేరకపోవడం వేగాన్ని అందుకోలేకపోవడం, ఫ్యామిలీ గొడవలు భరించలేకపోవడం వల్లనే వారికి జీవితంపై విరక్తి కలుగుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికి సరియైన మార్గం సన్యాసం స్వీకరించడం తప్ప వేరే మార్గంలేదన్నట్లుగా ఆలోచిస్తున్నారు. గతంలో లాగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ధైర్యం చెప్పే అమ్మమ్మ, నానమ్మలు లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే లాంటి జీవితాలు కావడంతో దేన్ని తట్టుకునే పరిస్థితి నేటి ఆధునిక మనిషికి లేదు. ధృడమైన మనస్తత్వం కలిగిలేకపోవడం వల్లే ఇలా అర్థాంతరంగా జీవితాన్ని ముగిస్తుండడానికి ప్రధాన కారణంగా చెపుతున్నారు.

సాధువులంతా యువ ఇంజనీర్లు.. పెళ్లైన వారే… జీవితంలో బాధ్యతలు, బరువులు ఐపోయిన వారే సాధువులుగా మారుతున్నారనుకుంటే పొరపాటు. ఈ సంవత్సం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాలోని మౌని అమావాస్యరోజు దాదాపు 20000మంది యువతీ, యువకులు సాధువులుగా మారిపోయారు. ఇందులో అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పది, ఇరవై వేల మందిలో దాదాపుగా అందరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, మెరైన్‌ బయోలాజిక్స్‌, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయెట్లు, విద్యార్థిని, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఇలా సాధువులుగా మారే వాళ్లలో ఒక్క హిందువులు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే. ఇందులో ముస్లింలు, క్రిస్టియన్‌ కమ్యూనిటిలకు చెందిన యువత కూడా ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచే కూడా ఎక్కువమందే క్యూ డుతున్నారు. ఉక్రెయిన్‌, మలేషియా, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి కూడా యువత మరీ కుంభమేళా వచ్చి సాధువులుగా మారిపోవడాన్ని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మన దేశంలో మాత్రం పెళ్లెన పురుషులు, ప్రతి నెల లక్షలు, కోట్లు సంపాదించే యువతీ, యువకులు తమ భవబంధాలను త్యాగం చేస్తూ ఆధ్యాత్మిక జీవనమే ప్రధానమార్గమంటూ సన్యాసి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. నాగసాధువులుగా మారిపోతున్నారు. అడవులకు వెళుతూ ఆకులు, అలములు తింటూ ధ్యానం చేస్తూ కాలం గడుపుతున్నారు.

ఈ సంవత్సరం అధికంగా పెరిగిన పురుష సన్యాసులు… పురుషు సన్యాసులు మాత్రం ఈ సంవత్సరం అధికంగా పెరిగిపోయారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ మనిషి మనసును సర్వనాశనం చేస్తుంది.. నిత్యం జరిగే జీవన పోరాటంలో పురుషుడే అన్నింటికి తన జీవితాన్ని ఫణంగా పెటా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close