జాతీయ వార్తలు

యువతను తప్పుదారి పట్టిస్తున్నారు

స్వామి వివేకానందకు ప్రధాని మోడీ నివాళులు

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ, మిగతా ఎంపీలకూ ఓ స్పష్టమైన తేడా ఉంటోంది. మిగతావారు ప్రతిపక్షాలు చేసే ప్రతీ విమర్శకూ కౌంటర్లు ఇస్తుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం… వెంటనే స్పందించెయ్యకుండా… జస్ట్‌ అలా చూస్తూ ఉంటారు. చివరకు తాను చెప్పదలచుకున్నది చెబుతారు. చెయ్యాలనుకున్నది చేస్తారు. ప్రస్తుతం దేశంలో పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలూ కొనసాగుతున్నా… ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీయే స్వయంగా తమ రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చెయ్యబోమని చెప్పినా… ప్రధాని నరేంద్ర మోడీ అవేవీ పట్టించుకోకుండా… అదే రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటన కొనసాగిస్తున్నారు. ఉదయమే… బెలూర్‌లోని మఠాన్ని సందర్శించిన మోడీ… స్వామి వివేకానంద జయంతి సందర్భంగా… ఆయనకు నివాళులు అర్పించారు.

పాకిస్థాన్‌ వంటి దేశాల్లో హింసకు గురవుతున్న ప్రజలకు అండగా నిలవడం కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. దీనివల్ల భారత్లోని ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని మరోసారి హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బంగాల్లో ఉన్న ఆయన ఆదివారం హావ్డాలోని బేళూరు మఠంలో జరిగిన వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. సీఏఏకి వ్యతిరేకంగా బంగాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ అక్కడి వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ చట్టంపై ప్రతిపక్షాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. పాకిస్థాన్‌ వంటి దేశాల్లో హింసకు గురై.. ఆశ్రయం కోసం వచ్చిన వారిని ఎలా తిప్పిపంపగలమంటూ ప్రతిపక్షాలకు చురకలంటించారు. మహాత్మా గాంధీ సైతం పాక్లో మతపరమైన హింసకు గురువుతున్న వారికి పౌరసత్వం కల్పించాలని ఆకాంక్షించారన్నారు. తాజా చట్టంపై జరుగుతున్న చర్చ వల్ల పాకిస్థాన్లో మైనారిటీలపై జరుగుతున్న ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయని అభిప్రాయపడ్డారు. యువజన దినోత్సవం సందర్భంగా దేశ యువతలో ప్రధాని స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. భారతదేశ భవిష్యత్తు యువతరం చేతిలోనే ఉందంటూ వారి బాధ్యతని గుర్తుచేశారు. నవ భారత నిర్మాణ లక్ష్యం యువత సంకల్పంతోనే నెరవేరుతుందని ఆకాంక్షించారు. సమస్యల నుంచి పారిపోకుండా.. వాటితో పోరాడాలని పిలుపునిచ్చారు. మఠాన్ని సందర్శించిన నేపథ్యంలో దివంగత ఆత్మస్థానానంద సేవల్ని గుర్తుచేసుకున్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా.. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ మార్గనిర్దేశకంగా పనిచేస్తుందన్నారు. వివేదకానుందుడు చూపిన మార్గమే తనలో నేటికీ స్ఫూర్తినింపుతోందన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close