యంగ్‌ హీరో ఎక్స్‌ ట్రా కేర్‌

0

వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌.. టైగర్‌ లాంటి చిత్రాలతో హిట్లు కొట్టాడు యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. ఆ తర్వాత కొన్ని వరుస పరాజయాలు కెరీర్‌ జోరుకి బ్రేక్‌ వేశాయి. కేరాఫ్‌ సూర్య.. మాయావన్‌.. మనసుకు నచ్చింది.. నెక్ట్స్‌ ఏంటి? ఇవన్నీ ఫ్లాప్‌ లుగా నిలవడంతో సందీప్‌ నిరాశకు గురయ్యాడు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అతడికి అవకాశాల పరంగా కొదవేం లేదని తాజా ట్రాక్‌ చూస్తే తెలుస్తుంది. సందీప్‌ వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. నిను వీడని నీడను నేను.. తెనాలి రామ బీఏ బీఎల్‌.. నరగ సూరన్‌ (తమిళ్‌) ఇలా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ రిలీజ్‌ లకు రెడీ అవుతున్నాయి. నేడు సందీప్‌ బర్త్‌ డే సందర్భంగా అతడి సినిమాల కొత్త లుక్‌ లను యూనిట్‌ వర్గాలు రిలీజ్‌ చేస్తున్నాయి. లేటెస్టుగా తెనాలి రామ బీఏబీఎల్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. కేసులు ఇవ్వండి ప్లీజ్‌! అంటూ సందీప్‌ దండం పెడుతూ చాలానే ఫన్‌ క్రియేట్‌ చేశాడు పోస్టర్‌ లో. తెలుగు తమిళంలో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మరో చిత్రం నిను వీడని నీడను నేను టీజర్‌ రిలీజై ఆకట్టుకుంది. హారర్‌ బ్యాక్‌ డ్రాప్‌ చిత్రంలో సందీప్‌ తో పాటు.. వెన్నెల కిషోర్‌.. మురళి శర్మ ప థ్వీ తదితరులు నటిస్తున్నారు. ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతోంది. అగ్రహారం నాగిరెడ్డి సంజీవు రెడ్డి నిర్మిస్తున్నారు. ఇకపోతే నిన్నటి సాయంత్రం హైదరాబాద్‌ లో సందీప్‌ మీడియా మిత్రులతో బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకోవడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. తొలి నుంచి మీడియాకి సన్నిహితుడిగా ఉన్న సందీప్‌ ఫ్రెండ్లీ మీట్‌ ఆకట్టుకుంది. నీవు లేక నేను లేను చిత్రానికి సందీప్‌ నిర్మాతగానూ కొనసాగుతుండడంతో ప్రచారం పరంగా చాలా కేర్‌ తీసుకుంటున్నాడు. ఇంత జాగ్రత్తగా ఉంటున్నాడు కాబట్టి కనీసం ఇకనైనా హిట్టొస్తుందేమో చూడాలి. నేడు బర్త్‌ డే జరుపుకుంటున్న సందీప్‌ కిషన్‌ కి శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here