Featuredరాజకీయ వార్తలు

మునుగోడును నిండా ముంచిన కూసుకుంట్లని ఓడించాల్సిందే

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అధికార మత్తులో ఆస్థులను పెంచుకోవడమే ధ్యేయంగా పని చేసిన మునుగోడు మాజీ శాశన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్వంత పార్టీ నాయకులతో పాటు తన ఆగడాలకు అడ్డు వచ్చిన ప్రజలపై అక్రమ కేసులు నమోదు చేయించి చరిత్రను సృష్టించారని నియోజకవర్గ ప్రజలు తన గోడును వెల్లబుచ్చారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించిన వారందరినీ కక్ష్యగట్టి వేదించడం ప్రారంభించిన కూనుకుంట్ల భినామీలను సృష్టించి బేరసారాలకు దిగి కోట్లాది రూపాయలను అర్జించాడని వారు ఆరోపించారు. నియోజకవర్గం అభివృద్ది కోసం రవ్వంతైనా ఆలోచించని ఎమ్మెల్యే తన అరాచకాలని ప్రశ్నించిన వారిపై కేసులని నమోదు చేయిస్తూ వేదింపులని ప్రారంబించాడని వారు ఆవేదన వ్యక్తపరిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మునుగోడు అభివృద్దిని గూర్చి అడిగిన 15 మంది దళిత యువకులపై అక్రమ కేసులు పెట్టించి ప్రజల చీదరింపులని ఎదుర్కొంటున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే తిరిగి తెరాస అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన పరిదిలో ఎటువంటి అభివృద్ది పనులను ప్రారంభించినా 12 శాతం కమీషన్‌ తీసుకుంటున్న ఎమ్మెల్యే అవినీతి కారణంగా నిర్మాణాలలో నాణ్యత లోపించి మూన్నాళ్ళ ముచ్చటగా అభివృద్ది ఆగిపోయిందని వారు పేర్కొన్నారు. గెరిల్లా పోరాటాలకు పుట్టినిల్లుగా అనేక ప్రజా ఉద్యమాలకు పురుడుపోసిన రాచకొండ చరిత్రకు తీరని అన్యాయం చేసిన కూసుకుంట్లను ఈ ఎన్నికల్లో ఓడించడం ఖాయమని వారు ముక్త కంఠంతో నినదించారు.ఎమ్మెల్యే కాకముందు కూసుకుంట్ల ఆస్థులు, ఎమ్మెల్యేగా అధికారం చేపట్టాక పెరిగిన ఆస్థులపై న్యాయ విచారణ జరిపించి నిజా నిజాలను నిగ్గు తేల్చాలని వారు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి తన స్వంత గ్రామానికి ఏమీ చేయలేని ప్రభాకర్‌ రెడ్డిని ఓడించాల్సిందేనని ఎమ్మెల్యే ఊరి ప్రజలు సైతం కదం తొక్కడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూసుకుంట్ల స్వంత గ్రామంలోవాటర్‌ ప్లాంటు ఎందుకు నిలిచిపోయిందో వివరించాలని వారు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఎంతో కాలంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణం ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తి కారణంగానే ముందుకు సాగడం లేదని వారు పేర్కొన్నారు. వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయితే ఫ్లోరోసిస్‌ భారిన పడుతున్న వారికి ఊరట లభించేదని వారు విలపించారు. మునుగోడు నియోజకవర్గంలో స్వంత పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సుమారు 70 మంది సర్పంచులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిన ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సర్వేలు చేపట్టి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి సచ్చీలుడని సర్టిఫికెట్‌ ఇచ్చి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల వారు విస్మయాన్ని వ్యక్త పరిచారు.ముఖ్యమంత్రి తీరును గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు అరాచకాలకు పాల్పడే ప్రజలను వేదించి సంపాదన పెంచుకున్న వారికే తగు ప్రాధాన్యతనిచ్చినట్లుగా ఉందని వారుఅనుమానం వ్యక్తపరిచారు. ఈ విధానాన్నే ఎంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆయన పార్టీని రాబోవు ఎన్నికల్లో భూస్థాపితం చేయాల్సిన సమయం ఆసన్నమైందని వారు శాపనార్థాలు సందించారు.

జాతీయ రహదారిపై గల చౌటుప్పల్‌ బస్‌స్టాండ్‌ డిపో నిర్మాణాన్ని సైతం పూర్తి కాకుండా కలెక్షన్‌ల వేటలో పడి నియోజకవర్గం అభివృద్దిని నిండా ముంచిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి జిల్లాలో నిజాయితీగా పని చేసే అధికారులని వేదింపులకు గురిచేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన ఆయన మహిళా అధికారులని సైతం వదలలేదని వారు వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి డబుల్‌ బెడ్‌రూంలని ఇస్తానని ప్రకటించిన మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నిర్మాణ పనులని అటకెక్కించిన ఎమ్మెల్యేకు ఈఎన్నికల్లో సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఆగడాలని, అక్రమాలను, వేదింపులని, బినామీ ఆస్థులని ప్రజలకు వివరించేందుకు త్వరలోనే ఓ కూటమిగా ఏర్పడి ప్రచారం చేసేందుకు లైక్‌ మైండెడ్‌ వ్యక్తులతో సమావేశాన్ని నిర్వహించేందుకు మునుగోడు ప్రజలు సమాయత్తమవుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close