వాట్సాప్‌లోనే ఇకపై షాపింగ్‌ చేయొచ్చు..!

0

న్యూఢీల్లీ : పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరింత మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు ఫేస్‌బుక్‌ ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేస్తూ వస్తోంది. తాజాగా ఇప్పుడు మరో కొత్త ఫీచర్లను జోడిస్తామని ప్రకటించింది. వాట్సాప్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచే డైరెక్ట్‌గా షాపింగ్‌ చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఎఫ్‌8 డెవలపర్‌ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాపారుల కోసం ప్రొడక్ట్‌ కేటలాగ్స్‌ ఫీచర్‌ తీసుకువస్తామని తెలిపారు. యూజర్లు యాప్‌ నుంచి ఈ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. వ్యాపారులకు సంబంధించిన వాట్సాప్‌ ప్రొఫైల్స్‌లో ప్రొడక్ట్‌ కేటలాగ్స్‌ కనిపిస్తాయి. కస్టమర్లు వీటిని చూడొచ్చు. నచ్చితే కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తే చిన్న వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వెబ్‌సైట్స్‌ నిర్వహణ, హైవ్యాల్యూ డొమైన్లలో లిస్టింగ్‌ వంటివి వీరికి భారం కావొచ్చు. వాట్సాప్‌ కొత్త ఫీచర్‌తో చిన్న వ్యాపారులు లక్షల మంది యూజర్లకు చేరువ కావొచ్చు. వాట్సాప్‌ ప్రస్తుతం తన ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్స్‌ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకొంత కాలం పట్టొచ్చు. ఈ వెసులుబాటు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత, వ్యాపారులు వారి ప్రొడక్టుల కేటలాగ్స్‌ను ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయడం ప్రారంభమైన తర్వాత వాట్సాప్‌ కూడా ఫేస్‌బుక్‌కు లాభదాయక కంపెనీగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here