ఔవును.. వాళ్ళు ఇష్టపడ్డారు

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

కాంగ్రెస్‌ మార్కు సంప్రదింపులు, బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించాయి. ఎవరికి ఏం కావాలో రంగంలోకి దిగిన వారికి నచ్చచెప్పి తాయిలా లను హావిూలుగా ఇచ్చింది. కార్పోరేషన్‌ పదవులు, చైర్మన్‌ పదవులు, ట్రస్ట్‌ బోర్డ్‌ పదవులు.. ఇలా అధికారంలోకి వస్తే.. ఎన్ని పదవులు ఉంటాయో.. అంతకు రెండింతలు హావిూలిచ్చి.. అసంతృప్తులను కాంగ్రెస్‌ అధిష్టాన నాయకగణం సంతృప్తి పరిచింది. తెలంగాణ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు సాగించిన బుజ్జగింపులు ఫలించాయి. చాలా స్థానాల్లో రెబల్స్‌, స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకున్నా రు. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి మధ్య స్నేహపూర్వక పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది.

రంగారెడ్డి జిల్లా:

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ రెబల్‌ భిక్షపతి యాదవ్‌, టీడీపీ రెబల్‌ మువ్వ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ రెబల్‌ శంకర్‌ గౌడ్‌, మరో ఐదుగురు నామినేషన్ల ఉపసంహ రణ చేవెళ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎస్‌ రత్నం పాదాభివందనంతో దిగివచ్చిన రెబల్‌ వెంకటస్వామి, నామినేషన్‌ ఉపసంహరణ

ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రాంరెడ్డి (ఎన్సీపీ), మర్పల్లి అంజయ్య యాదవ్‌(బీజేపీ రెబల్‌), గడ్డ జంగయ్య (ఇండిపెండెంట్‌), తోడే బాలచందర్‌ (ఇండిపెండెంట్‌) నామినేషన్ల ఉపసంహరణ

మేడ్చల్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్‌ నామినేషన్‌ ఉపసంహరణ

సంగారెడ్డి జిల్లా: పఠాన్‌చెరులో కాంగ్రెస్‌ రెబల్స్‌ అంజి రెడ్డి, సహను దేవ్‌, కొలను బాల్‌ రెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌, శశికళ యాదవ్‌ రెడ్డి నామినేషన్ల ఉపసంహరణ ఆందోల్లో అల్లారం రత్నయ్య, పొట్టిపల్లి మొగులయ్య, ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి మల్యాద్రి రెడ్డి నామినేషన్‌ ఉపసంహరణ

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి, పైలా కృష్ణారెడ్డి నామినేషన్ల ఉపసంహరణ

ఇండిపెండెంట్‌ నారాయణ నామినేషన్‌ ఉపసంహరణ

నిజామాబాద్లో బీజేపీ రెబల్‌ అభ్యర్థి ధన్పాల్‌ సూర్యనారాయణ గుప్తా నామినేషన్‌ ఉపసంహరణ

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలో నామినేషన్‌ ఉపసంహరించుకున్న కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థులు అమరేందర్‌ రెడ్డి, రేపాల శ్రీనివాస్‌,పోరెడ్డి స్రవంత్‌ రెడ్డి, టీజేఎస్‌ అభ్యర్థి గవ్వా విద్యాధర్‌ రెడ్డి

సూర్యాపేటలో కాంగ్రెస్‌ రెబల్స్‌ పటేల్‌ రమెష్‌ రెడ్డి, తండు శ్రీనివాస్‌ నామినేషన్ల ఉపసంహరణ

కోదాడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శశిదర్‌ రెడ్డి నామినేషన్‌ విత్డ్రా

కరీంనగర్‌ జిల్లా: హుజరాబాద్లో ఈటల జమున, బండి కళాధర్‌, బోయిని రఘు, మంతిని ప్రశాంత్‌, రాచపల్లి రమేష్‌, చిలువేరు శ్రీకాంత్‌, గుర్రం వెంకటేశ్వర్లు, కురుమెల్లి హరి నామినేషన్ల విత్డ్రా

జగిత్యాల జిల్లా: కోరుట్లలో స్వతంత్ర అభ్యర్థులు కొమిరెడ్డి జ్యోతి, జంగిలి సునీత, జువ్వాడి కృష్ణారావు పోటీ నుంచి తప్పుకున్నారు. ధర్మపురిలో స్వతంత్ర అభ్యర్థి రామగిరి సంతోష్‌ నామినేషన్‌ ఉపసంహరణ

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకున్న చేతి ధర్మయ్య, దాసరి పుష్పలతారెడ్డి, బొంకూరి కైలాసం, పల్కల వాసుదేవ రెడ్డి

రామగుండం నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి గోపు అయిలయ్య యాదవ్‌ నామినేషన్‌ ఉపసంహరణ

మహబూబ్నగర్‌ జిల్లా: మహబూబ్నగర్‌ నియోజకవర్గంలో యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి(స్వతంత్ర) రాజేందర్‌ రెడ్డి(టీజేఎస్‌) నామినేషన్ల ఉపసంహరణ

భద్రాద్రికొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేటలో టీజేఎస్‌, కాంగ్రెస్‌ రెబల్స్‌ సున్నం నాగమణి, మడకం ప్రసాద్‌ నామినేషన్ల ఉపసంహరణ పినపాకలో బీఎస్పీ అభ్యర్థి కేతావత్‌ స్వప్న, స్వతంత్ర అభ్యర్థి కొమరం రాంగోపాల్‌ నామినేషన్ల ఉపసంహరణ భద్రాచలంలో స్వతంత్రులు తెల్లం సీతమ్మ, పుణెం రాంబాబు నామినేషన్ల ఉపసంహరణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here