Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

రాసుకొండి.. దోచుకొండి..

ఒక్కరోజే 89లక్షల చలాన్‌లు వసూలు..

గతుకుల రోడ్లు మాత్రం అక్కడే..

ఇష్టారాజ్యంగా పెరుగుతున్న జరిమానాలు..

ఆదాయమే కావాలి సౌకర్యాలద్దు..

నాలుగు మూలలు కనబడుతే చాలు.. నలుగురు ట్రాఫిక్‌ పోలీసులు కనబడుతారు.. వచ్చిపోయే ప్రతి వాహనాన్ని ఆపుతే చలానుల మీద చలానులు రాస్తూ జరిమానాలు విధిస్తారు.. వారి పక్కనే గుంతలు రోడ్లు ఉన్నా, వాహనాదారులు గుంతలో పడి ప్రమాదానికి గురైనా తమ పనికాదంటూ, తమకేమి సంబంధం లేనట్లుగానే చూస్తారు.. మరీ రోడ్ల నిర్మాణం మీ పని కానప్పుడు చలానాలు ఎందుకు రాస్తున్నారంటే నిర్మించడం కాదు కాని చలానాలు రాసి వాహనాదారులు దగ్గర మరీ మరీ డబ్బులు వసూలు చేయడమే మా పని అంటున్నారు.. అందుకే పోలీసులు ఇతర విధుల కంటే చలానాల విధులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం దేశవ్యాప్తంగా తెలిసిందే.. చిన్న చినుకు పడుతే చాలు నగరాలన్నీ చెరువులను తలపిస్తాయి.. రోడ్లన్నీ గుంతలు, గుంతలుగా తేలిపోతాయి.. వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు అలాగే ఉన్నా వాటి పక్కనే వాహనాల తనిఖీల పేరుతో పోలీసులు చలానాలు రాస్తూ కనిపిస్తారు.. ప్రభుత్వం ఆదేశించింది మేము చేస్తున్నామంటారు.. నిజంగా అదీ వారి తప్పు కాదు. వారితో చేపిస్తున్న ప్రభుత్వం తప్పుగానే చెప్పాలి.. రోడ్ల స్థితిగతులపై పట్టించుకొని ప్రభుత్వం, ట్రాఫిక్‌ నియంత్రణలో అష్టకష్టాలు పడుతున్న స్పందించని ప్రభుత్వం వాహనాదారులపై జరిమానాలు వేస్తూ డబ్బులు వసూలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక్కడేక్కడో సిగ్నల్‌ దగ్గర ఉండాల్సిన యూటర్న్‌ మూసేసి, ఎక్కడో కిలోమీటర్‌ దూరాన పెడుతూ వాహనాదారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తమకే సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.. ఈ బిజీ జీవితంలో ఎవరి బతుకు వారికే గగనంగా మారడంతో పట్టించుకునే వారే కరువయ్యారు.. రోడ్డు ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేదీ లేదంటూ, ప్రజల రక్షణకే ప్రభుత్వాలంటూ వేలకు వేలుగా చలానాలు విధించేందుకే మొగ్గు చూపుతున్నాయి ప్రభుత్వాలు.. సెప్టెంబర్‌ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, వాహనాదారులు ఎవరూ ఉల్లఘించినా ఉపేక్షించేది లేదంటున్న ప్రభుత్వం వాహనాదారులపై మొసలి కన్నీరు కారుస్తోంది.. అతుకుల, గతుకుల రోడ్లపై పడి ప్రజలు ప్రాణాలు కొల్పోతున్న, ప్రమాదాలకు గురై జీవచ్చవాలుగా మారుతున్న ప్రజల్లో మార్పుకొరకు అవగాహన సదస్సులు, చైతన్యం కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వాలు జరిమనాలు వసూలు చేయడమే ప్రధానకర్తవ్యమని భావిస్తూ ముందుకు పోతుంది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

అడిగేవారుండరు.. ప్రశ్నించేవారు అస్సలు కనబడరు.. సమస్యలు పెరుగుతూనే ఉన్నా, సదుపాయాలు కరువవుతూనే ఉన్నా కనీస స్పందన లేకుండా బతకడం అలవాటైపోయింది.. అందుకే పన్నులు ఇష్టానుసారంగా పెరుగుతున్నాయి.. ఇప్పుడు వాహనం నడపాలంటే భయం పుడుతోంది.. వంద రూపాయలు ఉన్నా చలానా వెయ్యి దాటింది. వెయ్యి ఉన్నది పదివేలు.. సెప్టెంబర్‌ నుంచి చలానాలను పెంచుతున్నామని ప్రకటించిన ప్రభుత్వం మరీ ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదు.. ప్రజల సమస్యలు, వారు పడుతున్న బాధలు తమ విధి కాదనుకుంటుందా లేక తమకేమి సంబంధలేనట్లుగానే వ్యవహరిస్తుందా అనేది అర్థమే కావట్లేదు.. మారుమూల పల్లెల్లో కాదు రాష్ట్ర రాజధానిలో అడుగు బయట పెడుతేచాలు నగర రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ రోడ్డు ఉందో, అక్కడెక్కడో గుంతలున్నాయో అర్థం కాని పరిస్థితిలో నగర రోడ్లు ఉన్నాయి. వాటిపై నిత్యం ప్రయాణం చేస్తూ నరక ప్రజలు ప్రతిరోజు నరకం చూస్తూనే ఉన్నారు. రోడ్ల మరమ్మత్తులను మరిచిన ప్రభుత్వం ట్రాఫిక్‌ విధులను ఉల్లఘించే వారిపై చలానాల రూపంలో దోచుకోవాలని ప్రోత్సాహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రోజురోజుకు నగరంలోని రోడ్లు నరకానికి రహదారులుగా మారుతున్న ఒక్కరికంటే ఒక్కరికి పట్టింపులేనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

ఒక్కరోజులోనే 89లక్షలు వసూలు..

సెప్టెంబర్‌ పస్ట్‌ నుంచి పెంచిన చలాన్లు అమల్లోకి రానున్నాయని గత పదిహేను, ఇరవై రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి తోడు పెండింగ్‌లో ఉన్న చలానాలు కూడా ఇప్పుడే చెల్లించాలని లేని యెడల కొత్త చలాన్‌ల విధానం అమలవుతోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకోవడంతో వాహనాదారులు ఏం జరుగుతోందని భయపడిపోయారు.. రోడ్లపై సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు చేసింది. 2019, సెప్టెంబర్‌ 1 నుంచి సరికొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం వాహనదారులకు విధించే జరిమానాల మొత్తాన్ని భారీగా పెంచేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆ రేంజ్‌ లో ఫైన్లు పెంచారు. కొత్త చట్టం ఎఫెక్ట్‌ బాగానే కనిపించింది. సోషల్‌ విూడియా పుణ్యమా అని హైదరాబాద్‌ లో భారీగా ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించారు. పాత చలాన్లకు కొత్త జరిమానా వర్తిస్తుందని.. సోషల్‌ విూడియాలో తప్పుడు వార్తలు ప్రచారం జరిగింది. ఇది నిజమే అనుకుని చలానుదార్లు అలర్ట్‌ అయ్యారు. పెండింగ్‌ చలాన్లు కట్టేందుకు వాహనదారులు ఎగబడ్డారు. దీంతో శనివారం(ఆగస్టు 31,2019) ఒక్క రోజే ట్రాఫిక్‌ చలాన్ల రూపంలో రూ.89లక్షలు మొత్తం వచ్చింది. భారీ మొత్తంలో చలాన్లు కట్టడంతో ఖజానాకి మంచి ఆదాయం వచ్చింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. పాత చలాన్లకు కొత్త జరిమానా వర్తిస్తుందని సోషల్‌ విూడియాలో తెగ ప్రచారం జరిగింది. ఇది నిజం కాదని ఏకంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. అయినా ఇది నిజమే అనుకుని భయపడ్డ వాహనదారులు చలాన్లు కట్టేందుకు క్యూ కట్టారు. కాని ప్రజలు నిత్యం ట్రాఫిక్‌ నియంత్రణ వల్ల, అతుకుల రోడ్ల వల్ల పడుతున్న బాధలను మాత్రం పట్టించుకునేవారు లేకపోవడం మరీ దారుణమని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వాహనాదారులు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకునే వారు మాత్రమే కరువయ్యారు. కొన్ని రాష్ట్రాల్లో పెంచిన వాహన జరిమానాలను కొన్ని రోజులు ఆపుతామని అప్పటివరకు వాహనాదారులకు అవగాహన కల్పిస్తానమని అంటున్నారు. ఇది ఎంతవరకు అపుతారో, ఎక్కడ అవగాహన కల్పిస్తారో తెలియడమే లేదు..

కొత్త చట్టం ప్రకారం జరిమానాలు ఇవే:

I హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే… కొత్త చట్టం మేరకు రూ.1000 (ప్రస్తుతం రూ.100) లేదా 3 నెలల పాటు లైసెన్సు రద్దు.I మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు (ప్రస్తుతం రూ.2 వేలు)I సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడిపితే రూ.వెయ్యి (ప్రస్తుతం రూ.100)I డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.500)I రాంగ్‌ రూట్‌లో వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1100)I అతివేగంతో వాహనం నడిపితే రూ.1000 లేదా రూ.2 వేలు (ప్రస్తుతం రూ.400)I ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1000)I అంబులెన్స్‌ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు (ప్రస్తుతం ఎలాంటి అపరాధం లేదు)I వాహనానికి బీమా లేకపోతే రూ.2 వేలు (ప్రస్తుతం రూ.1000)I పర్మిట్‌ లేని వాహనానికి రూ.10 వేలు (ప్రస్తుతం రూ.5000)I త్రిపుల్‌ డ్రైవింగ్‌ చేస్తే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1200)I సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తే రూ.5 వేలు (రూ.వెయ్యి)I మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే రూ.25 వేలు లేదా సంరక్షకులు లేదా యజమానికి మూడేళ్ల జైలు, ఫైన్‌. (ప్రస్తుతం రూ.1500 మాత్రమే వసూలు చేస్తున్నారు.)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close