బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బ్జడెట్‌ వ్యవహారాలు పట్టాలకెక్కుతున్నాయి. బడ్జెట్‌ కార్యక్రమాలు చేపట్టే ముందు లాంఛనంగా ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్వహించారు. ఈ వేడుకను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా ప్రారంభిం చారు. దీంతో సోమవారం నుంచి నుంచి మధ్యంతర బ్జడెట్‌ కాగితాల ముద్రణను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పొన్‌ రాధకృష్ణన్‌, ఆర్థిక

శాఖ కార్యదర్శి డీఈఏ సుభాష్‌ గార్గ్‌ పాల్గొన్నారు. ప్రతిసారి బ్జడెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో ‘హల్వా వేడుక’ నిర్వహిస్తారు. బ్జడెట్‌ సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బ్జడెట్‌ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ క్రతువులో పాల్గొంటారు. బ్జడెట్‌ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయం బేస్‌మెంట్‌లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండి పోతారు. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ

వంటకమైన హల్వాను చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. కానీ ఈసారి ఆర్థిక మంత్రి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లడంతో పాల్గొనలేదు. దీంతో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్‌ పాల్గొన్నారు. జైట్లీ మధ్యంతర బ్జడెట్‌ను ప్రవేశపెట్టేందుకు అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఆయనే మధ్యంతర బ్జడెట్‌ను ప్రవేశపెడతారని తెలుస్తోంది. గత ఏడాది మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్న 66ఏళ్ల జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల అమెరికాకు వెళ్లారు. ఆర్థిక మంత్రి కూడా బ్జడెట్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు ఉంచుకోరు. ఇవి మొత్తం జాయింట్‌ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి. 1950 వరకు బ్జడెట్‌ ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించే వారు. కానీ అక్కడ అవి లీక్‌ కావడంతో దానిని మింట్‌ రోడ్‌లోని గవర్నమెంట్‌ ప్రెస్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో దీనిని నార్త్‌బ్లాక్‌లోని బేస్‌మెంట్‌కు మార్చారు. అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతోంది. బ్జడెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు. బంధువులకు కూడా ఫోన్‌ చేసుకొనే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్‌ చేసుకోవచ్చు. బ్జడెట్‌ ప్రవేశపెట్టే రోజు ఆర్థిక మంత్రిత్వశాఖలోని కంప్యూటర్లలో ఈమెయిల్‌ సౌకర్యాన్ని బ్లాక్‌ చేస్తారు. బ్జడెట్‌కు కొన్ని రోజుల మందు పీఐబీ అధికారులను అక్కడికి అనుమతిస్తారు. వారు బ్జడెట్‌ తర్వాత చేయాల్సిన పత్రికా ప్రకటనలను పరిశీలిస్తారు.

అరుణ్‌ జైట్లీ చేతుల మీదుగానే చివరి బడ్జెట్‌

ఎన్నికల ముందు కేంద్ర బడ్జెట్‌ను కూడా ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీయే ప్రవేశ పెడతారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ ఏడాది బ్జడెట్‌ను ప్రవేశపెట్టలేకపోవచ్చు అని ఊహాగానాలకు తెరదించారు. ఆయన బ్జడెట్‌ను ప్రవేశపెట్టేందుకు అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఆయనే మధ్యంతర బ్జడెట్‌ను ప్రవేశపెడతారని తెలుస్తోంది. గత ఏడాది మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్న 66ఏళ్ల జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల అమెరికాకు వెళ్లారు. దీంతో ఆయన బ్జడెట్‌ ప్రవేశపెట్టే సమయానికి వస్తారా లేదా.. లేదంటే ఎవరు బ్జడెట్‌ను ప్రవేశపెడతారని రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. ఈ నెల 31 నుంచి లోక్‌సభ చివరి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాంగగా ఫిబ్రదవరి 1న బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. ఓటాన్‌ బడ్జెట్‌ కోసం కేంద్రం ఇప్టపికే కసరత్తు చేస్తోంది. ఈసారి బ్జడెట్‌లో రైతులు, మధ్య తరగతి ప్రజల కోసం పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో రైతులకు ఉపయోగపడేలా, వారికి ఆదాయం పెరిగేలా పథకాలు ప్రవేశపెట్టొచ్చని భావిస్తున్నారు. అలాగే ఆదాయపన్ను పరిమితిని కూడా పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2016 వరకు బ్జడెట్‌ను ఫిబ్రవరి నెల చివరి పనిదినం రోజున ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి జైట్లీ ఆ సంప్రదాయాన్ని మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీన బ్జడెట్‌ను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన మెడికల్‌ చెకప్‌ కోసం ఇటీవలే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి కేంద్ర బ్జడెట్‌ ను అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టకపోవచ్చు అని ఊహాగానాలు వెలువెత్తాయి. ఈ క్రమంలో బ్జడెట్‌ ను ఎవరూ ప్రవేశపెడుతారనేది చర్చానీయాంశంగా మారింది. అయితే ఈ ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఫిబ్రవరి 1వ తేదీన అరుణ్‌ జైట్లీనే పార్లమెంట్‌ లో బ్జడెట్‌ ప్రవేశపెడుతారని తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here