కాంగ్రెస్‌ హయాంలోనే.. మహిళా సాధికారత

0
  • తెరాస ప్రభుత్వం మహిళలను చిన్నచూపుచూస్తుంది
  • మంత్రి వర్గంలో మహిళలకు స్థానమే లేదు
  • మోడీతో కేసీఆర్‌ కు లోపాయకారి ఒప్పందం
  • టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని, దేశానికి తొలి మహిళా ప్రధానిని అందించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బేగంపేట్‌లోని ¬టల్‌ మానస్‌ సరోవర్‌లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు ఎప్పుడూ ఉన్నతమైన స్థానం కల్పిస్తూ వస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ కాలంగా మహిళా నాయకత్వంలో నడుస్తోందని తెలిపారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని అందించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మహిళలకు సముచితమైన స్థానాలు కేటాయించిందన్నారు. మహిళలకు రాజకీయంగా.. ఆర్థిక సాధికారతకు కాంగ్రెస్‌ కృషి చేసిందని, మోడీ.. కేసీఆర్‌ పాలనలో మహిళా సాధికారతను ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర కేబినెట్‌ లో మహిళలకు స్థానం కల్పించలేదని ఉత్తమ్‌ విమర్శించారు. మోడీ పాలనలో మైనార్టీ లకు రక్షణ లేకుండా పోయిందని, మోడీతో కేసీఆర్‌ కు లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. ఈ విషయాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌ సూచించారు. మోడీ పాలనలో నిరుద్యోగ సమస్యతో పాటు, రైతుల జీవితాలు దుర్బరం అయ్యాయని అన్నారు. మోడీ ఇచ్చిన ఏఒక్క హావిూని నెరవేర్చలేదని, రాహుల్‌ ప్రధాని కావడం దేశానికి ఎంతో అవసరమన్నారు. రాష్ట్ర పర్యటనకు రానున్న రాహుల్‌ గాంధీ శంషాబాద్‌ లో నిర్వహించే సభలో కనీస ఆదాయ పథకం, ఉద్యోగ కల్పనపై స్పష్టమైన హావిూ ఇవ్వబోతున్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మహిళలకు ఆస్తిహక్కు చట్టం తెచ్చింది నెహ్రూనే – జైపాల్‌రెడ్డి

మహిళలకు ఆస్తిహక్కు చట్టం తెచ్చింది జవహర్‌ లాల్‌ నెహ్రూ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మనువాద మనస్తత్వం కలిగిన పార్టీ బీజేపీ అని విమర్శించారు. మహిళలకు రాజకీయాల్లోనే కాదు సామాజిక అభివృద్ధి సాధించాలని ఆయన అన్నారు. మహిళల 

సాధికారతపై మహిళా కాంగ్రెస్‌ కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

మహిళలపై ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి – మధుయాష్కి

దేశంలో మహిళలపై ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మధుయాష్కి ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు సంకల్పంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కేసీఆర్‌ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదని విమర్శించారు. రాజకీయంగా మహిళలకు ప్రాధాన్యత పెరగాలని మధుయాష్కి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫెడరల్‌ కూటమి పేరుతో కేసీఆర్‌ బి-టీమ్‌గా పనిచేస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్‌ మహిళలకు మంత్రి పదవి ఇవ్వాలని మధుయాష్కి డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here