మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

0
  • సంగారెడ్డి జిల్లాలో ఘటన
  • తోటి కానిస్టేబులే హంతకుడు
  • నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు

సంగారెడ్డి (ఆదాబ్‌ హైదరాబాద్‌): సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురైంది. ప్రేమించిన తోటి కానిస్టేబులే ఆమెను అడ్డు తొలగించుకొనేందుకు హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రామచంద్రాపురం పీఎస్‌ పరిథిలో సోమవారం జరగ్గా.. ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ రామచంద్రరరావు, బాధితురాలి తండ్రి సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న ప్రకాష్‌, మందాకి గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రకాశ్‌కు గతంలోనే వేరే అమ్మాయితే పెళ్లైన మందాకినితో అక్రమ సంబంధం కొనసాగించాడు. పెళ్లి విషయం తెలుసుకున్న మందాకిని తనను కూడా వివాహం చేసుకోవాలని గట్టిగా నిలదీసింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం విధులు నిర్వహించుకొని మందారిక, ప్రకాశ్‌ బయటకు వెళ్లారు. మందారిక ఇంటికి తిరిగి రాకపోయేసరికి ఆమె తండ్రి రామంచద్రాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి ప్రకాశ్‌ను విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఆమెను హత్యచేసి పెట్రోలుపోసి తగలబెట్టినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా మందాకిని మృతితో కుటుంబ సభ్యులు విషాధంలో మునిగిపోయారు. తమ బిడ్డను పొట్టనపెట్టుకున్న ప్రకాశ్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

పథకం ప్రకారమే హత్య… కానిస్టేబుల్‌ ప్రకాశ్‌. మందారికను పథకం ప్రకారమే ప్రకాష్‌ హత్య చేశాడని ఏసీపీ రవికుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు ప్రకాశ్‌ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. కొద్ది సేపటి క్రితం ఏసీపీ రవికుమార్‌ విూడియాతో మాట్లాడుతూ, మందారిక హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మందారికను కారులో ఎక్కించుకుని వెళ్లి వెంకటాపూర్‌ శివారులో హత్య చేశాడని తెలిపారు. పోలీసు శాఖలో ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమన్నారు. ఒక కానిస్టేబుల్‌ అయి ఉండి మరో లేడీ కానిస్టేబుల్‌ను చంపడం బాధాకరమన్నారు. మందారిక అంత్యక్రియలను శాఖా పరంగా నిర్వహిస్తామని ఏసీపీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here