ఉల్ఫ్‌ మూన్‌.. గ్రహణం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

2019లో ఏర్పడుతున్న తొలి చంద్రగ్రహణం ఇది. ఈ గ్రహణాన్ని ‘వోల్ఫ్‌ మూన్‌’గా పిలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2018లో అరుదైన చంద్ర గ్రహణాలను చూసే అవకాశం మనకు లభించిం ది. ఈ ఏడాది కూడా మరో భిన్నమైన చంద్ర గ్రహణాన్ని చూసే అవకాశం లభించనుంది. ఈ గ్రహణం పేరు ‘సూపర్‌ బ్లడ్‌ వోల్ఫ్‌ మూన్‌’. ఈ పేరుకు తగినట్లే.. ఒకే గ్రహణం మూడు రకాలుగా కనిపిస్తుంది. వివిధ దేశాల కాలమా నాల ప్రకారం జనవరి 20, 21 తేదీల్లో ఏర్పడు తుంది. చంద్రగ్రహణం, సూపర్‌ బ్లడ్‌ మూన్‌, వోల్ఫ్‌ మూన్‌లు ఒకేసారి ఏర్పడనున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనికి ‘సూపర్‌ బ్లడ్‌ వోల్ఫ్‌ మూన్‌’ అని పేరు పెట్టారు. ఈ గ్రహణాన్ని ఇండియాతో పాటు ఆసియా దేశస్తులు పూర్తిగా చూడలేరు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం జనవరి 21, ఉదయం 10.11 గంటలకు ఈ గ్రహణం ఏర్పడుతుంది. 62 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణం మొదలై పూర్తికావడానికి సుమారు 3 గంటల 50 నిమిషాలు పడుతుంది. సూపర్‌ బ్లడ్‌ వోల్ఫ్‌ మూన్‌ అంటే?: చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో మనకు తెలిసిందే. చంద్రగ్రహణం రోజున సూర్యుడు, చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వస్తుంది. దీనివల్ల భూమి నీడ చంద్రుడు మీద పడి గ్రహణం ఏర్పడుతుంది. అలాగే, చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పెద్ద ఆకారంలో కనిపిస్తాడు. ఈ ప్రక్రియను సూపర్‌ మూన్‌ అంటారు. అదే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడితే ‘సూపర్‌ బ్లడ్‌ మూన్‌’ అని పిలుస్తారు. చంద్రుడు బాగా దగ్గరకు రావడం వల్ల చంద్రుడుపై పడే నీడ నల్లగా కాకుండా ఎర్ర రంగులో ఉంటుంది. దీనివల్ల సూపర్‌ బ్లడ్‌ మూన్‌ రక్తం రంగులో కనిపిస్తుంది.

కొద్ది రోజుల్లో ఏర్పడే 'సూపర్‌ బ్లడ్‌ వోల్ఫ్‌ మూన్‌'లో చంద్రగ్రహణం, సూపర్‌ మూన్‌ రెండూ ఉంటాయి. అమెరికా గిరిజనులు.. శీతాకాలంలో పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడిని 'వోల్ఫ్‌ మూన్‌' అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో జనవరి 21న ఏర్పడే గ్రహణానికి 'సూపర్‌ బ్లడ్‌ వోల్ఫ్‌ మూన్‌' అని పేరు పెట్టారు. నక్కలకు, చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉందని అమెరికాలోని కొన్ని సాంప్రదాయాల వారు నమ్ముతారు. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే పౌర్ణమి రోజులను 'ఉల్ఫ్‌ మూన్‌' అని పిలుస్తారు. దీని ఆధారంగా హాలీవుడ్‌లో 'ది ట్విలైట్‌ సాగా' వంటి సినిమాలు కూడా వచ్చాయి. 

భారత్‌లో కనిపిస్తుందా?

దక్షిణ పసిఫిక్‌, అంటార్కిటిక్‌ ప్రాంతాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం రెండు లేదా మూడేళ్లకోసారి సంభవిస్తుంది. భారత్‌లో మాత్రం ఇది చాలా అరుదుగా ఏర్పడతుంది. జనవరి 6న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం ఈశాన్య ఆసియా, ఫసిఫిక్‌ తీరంలోనూ దర్శనమిస్తుంది. ఇండియాలో మాత్రం ఈ గ్రహణం కనిపించదు. చైనా, రష్యాలోని సైబీరియా, కొరియా ద్వీపం, జపాన్‌తోపాటు ఉత్తర ఫసిక్‌, ఆసియా ప్రాంతాల్లోనే దీని ప్రభావం ఉంటుంది. పదిహేను రోజుల వ్యవధిలోనే సంపూర్ణ చంద్రగ్రహణం అంటే జనవరి 21 న కనువిందు చేయనుంది. ఇది సెంట్రల్‌ పసిఫిక్‌, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లోనూ కనిపిస్తుంది. ఈ ఏడాది మొత్తం ఐదు సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. అలాగే, ఒకటి పాక్షిక చంద్రగ్రహణం, ఒకటి పాక్షిక సూర్యగ్రహణం. అలాగే పదమూడేళ్లకు ఒకసారి సూర్యుడి కక్ష్యను దాటి బుధుడు సంచరిస్తారు. ఇది ఏడాది నవంబరులో జరుగుతుంది. డిసెంబర్‌ 26, 2019 న ఏర్పడే సూర్య గ్రహణం దక్షిణ భారతదేశం, శ్రీలంక, కొన్ని గల్ఫ్‌ దేశాలు, సుమత్రా, మలేషియా, సింగపూర్‌లలో కనిపించనుంది. కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కోసం మరో 16 ఏళ్లు వేచి చూడాల్సిందే.

మన దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం 2034లో కనువిందు చేయనుంది. దక్షిణ పసిఫిక్‌, అంటార్కిటిక్‌ ప్రాంతాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం రెండు లేదా మూడేళ్లకోసారి వస్తూనే ఉంటుంది. కానీ మన ప్రాంతంలో మాత్రం చాలా అరుదుగా సంభవిస్తుంది. పాక్షిక సూర్యగ్రహణం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11: 34: 08 గంటలకు మొదలై తెల్లవారుజామున 3.49 గంటలకు వరకు ఉంటుంది. అంటే భారత కాలమాన ప్రకారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటలకు వరకు. ఇక, జపాన్‌లో ఉదయం 8.30 నుంచి 10.30 వరకు కనువిందు చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here