ఏ ఆధారాలతో.. రాఫెల్‌పై ఆరోపణలు చేశారు?

0

సైన్యానికి, ప్రజలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి: అమిత్‌షా

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఏ ఆధారాలతో రాఫెల్‌ ఒప్పందంపై రాహుల్‌ ఆరోపణలు చేశారో చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు అమిత్‌ షా అన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రఫేల్‌ ఒప్పందంలో ధర విషయమై కాంగ్రెస్‌ చాలా ఆరోపణలు చేసిందని విమర్శించారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని సుప్రీం తీర్పుతో తేలాయని షా అన్నారు. భారత సైన్యానికి, దేశ ప్రజలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ ఆధారాలున్నాయని రఫేల్‌ వ్యవహారంలో ఆరోపణలు చేశారని రాహుల్‌ను అమిత్‌షా ప్రశ్నించారు. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య పారదర్శకంగా ఒప్పందం జరిగిందని వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రఫేల్‌ ఒప్పందంపై కొంతమంది లేని ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here