బిజినెస్

స్వల్ప నష్టాలతో …

ముంబయి: దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్‌18.17 పాయింట్లు నష్టపోయి, 38,963.26 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 12.50 పాయింట్ల నష్టంతో 11,712వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.69.31గా ఉంది. ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడి, 39,172 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే, చివరి గంటల్లో అమ్మకాలు వెల్లువెత్తడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్‌ కారణంగా మదుపరుల సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో నష్టాల్లోకి జారుకున్న సూచీలు 38,920పాయింట్లకు పడిపోయాయి. చివర్లో కాస్త కోలుకున్నసెన్సెక్స్‌ 18 పాయింట్ల నష్టంతో 38,963 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 12.50 పాయింట్ల నష్టంతో 11,712వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఇండియా బుల్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంకు షేర్లు లాభపడగా, టీసీఎస్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close