విజ్డం జాబ్స్‌’ సంస్థ గుట్టు రట్టు

    0

    మోసపూరిత సంస్థలతో జాగ్రత్త

    అనుమానాలుంటే పోలీసులకు తెలపండి

    సీఈవోతో సహా 14మంది అరెస్ట్‌

    వివరాలు వెల్లడించిన సిపి సజ్జన్నార్‌

    హైదరాబాద్‌, జనవరి25(ఆర్‌ఎన్‌ఎ) : ఉద్యోగాల పేరిట ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో నిరుద్యోగులను మోసగించిన ‘విజ్డం జాబ్స్‌’ సంస్థను గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. దీనిపై పూర్తిస్తాయి విచారణ చేపట్టామని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌ తెలిపారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో తమకు ఒప్పందాలు ఉన్నాయని పేర్కొంటూ.. అనేక దేశాల్లో నిరుద్యోగులను ఈ సంస్థ మోసగించిందని అన్నారు.

    ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఇలాంటి సంస్థలనట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసలు జరిగితే పోలీసులకు తెలపాలన్నారు. గుడ్డిగా నమ్మకుండా పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అన్‌ఆనరు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ జాబ్‌ పోర్టల్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ టోకరా ఇచ్చిందని సిపి అన్నారు. నిరుద్యోగుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు విజ్డం జాబ్స్‌ పోర్టల్‌ సీఈవో అజయ్‌ కొల్లాతోపాటు 14మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్న ఈ జాబ్‌ పోర్టల్‌ వ్యవహారంపై సైబర్‌ నిపుణులు, దర్యాప్తు అధికారులతో కూడిన 10ప్రత్యేక బృందాలు విచారణ జరిపాయని అన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జాబ్‌ పోర్టల్‌ విజ్డమ్‌ జాబ్స్‌.కామ్‌.. ఉద్యోగాల ఆశచూపి నిరుద్యోగుల నుంచి వందకోట్ల రూపాయలకుపైగా కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మూడుకోట్లమంది ‘రిజిస్టర్డ్‌ యూజర్లు’ ఉన్నారని, మన దేశంలో లక్షల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఆయన వెల్లడించారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here