గెలుపు నాదంటే నాదే…?

0
  • ఖమ్మంలో గెలుపుపై నామా, రేణుకల ధీమా
  • ఓటింగ్‌ తమకే అనుకూలమని వ్యాఖ్యలు

ఖమ్మం : ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధిస్తుందని టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. భారీ మెజార్టీతో తాను ఎంపిగా గెలవబోతున్నానని అన్నారు. తన గెలుపుకోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడిక్కడ మాట్లాడుతూ కెసిఆర్‌ సంక్షేమ,అబివృద్ది పథకాలే తన విజయానికి సోపానమని అన్నారు. ఖమ్మంలో ప్రజలు టిఆర్‌ఎస్‌ను ఆదరించారని అన్నారు. అందుకు వారికి రుణపడి ఉన్నానని అన్నారు. తాను మరింతగా కష్టపడి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఇదిలావుంటే ఖమ్మంలో చరిత్రాత్మక తీర్పు రాబోతోందని ఖమ్మం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి జోస్యం చెప్పారు. నైతిక బాధ్యతగా ఎన్నికల్లో డబ్బు పంచలేదని, ధన రాజకీయం కంటే, ప్రజా రాజకీయం వైపు ప్రజలు మొగ్గు చూపారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్‌ అంటూ ఆమె హెచ్చరించారు. ఎన్నికల్లో తనపై చాలా రూమర్లు సృష్టించారని, అభిమానం, ప్రేమతో తనను పలకరించొచ్చు కానీ.. డబ్బుతో కొనేంత ఆస్తి మీ దగ్గర లేదని రేణుకా చౌదరి చెప్పారు. ఎన్నికలను సజావుగా నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతుల తెలిపారు. ఇదిలావుంటే రాజకీయంగా చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు మరోసారి విలక్షణమైన తీర్పు ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. గురువారం జరిగిన ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గం పోలీంగ్‌ సరళీని పరిశీలిస్తే ఈసారి గతంకంటే భిన్నమైన తీర్పు రాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు విభిన్నమైన తీర్పునిచ్చే ఈ జిల్లా ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా అదే పంధాను కొనసాగించినట్లు అంచనావేస్తున్నారు. పోలీంగ్‌ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అభ్యర్ధులంతా లెక్కలతో కుస్తీలు పడుతున్నారు బూత్‌ల వారిగా,గ్రామాల వారిగా,మండలాల వారిగా,పట్టణాల వారిగా,నియోజకవర్గాల వారిగా పోలైన ఓట్ల లెక్కలను,పార్టీలవారిగా పోలైన ఓట్ల వివరాలను తెప్పించుకొని పోస్టుమార్టమ్‌ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌ శాతంతో నేటి ఎన్నికల పోలీంగ్‌ శాతంతో పోల్చీతే కేవలం 10.55 శాతం ఓట్లు తగ్గాయి.2014 పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చీతే 6.27 శాతం ఓట్లు తగ్గాయి. అయితే తగ్గిన ఓటింగ్‌ వల్ల ఎవ్వరికి నష్టం చేకురుతుందనే దానిపై కూడా వివిధ కొణాల్లో అంచనావేశారు. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మాత్రం ఖమ్మం పార్లమెంట్‌ స్ధానంలో గెలవడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 50వేల లోపు మెజార్టీతో విజయం సాధిస్తామని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో 20వేల నుంచి 60 వేల వరకు మెజార్టీ రావచ్చోవని వారు అంటున్నారు. అంతేగాక ఇక్కడ గెలుపు కోసం ముఖ్యనాయకులంతా కలిసికట్టుగా పనిచేయడం వల్ల విజయం ఖాయమనే ధీమాను నామా వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుతో మొదలుకొని సిట్టింగ్‌ ఎం పి పొగులేటి శ్రీనివాస్‌ రెడ్డి,స్ధానిక ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జ్‌లు ఐక్యమత్యంతో కిలిసి పోరాడారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన స్ధానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సిట్టింగ్‌ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌ బాబు, జలగం సోదరులు, పిడమర్తి రవి ,డాక్టర్‌ దయానంద్‌ తదితర ముఖ్యనేతలంతా ఈ ప్రాంతాకి చెందిన వారు కావడంతో ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ పై ఆ పార్టీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. వీరంతా ఒకటై నామాను గెలిపించుకోవడానికి నడుం బిగించి పనిచేయడం వల్ల ఇక్కడ అంచనాలు భారీగానే ఉన్నాయి. కాంగ్రెస్‌ శిభిరం కూడా గెలపుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. 5వేల నుంచి 35వేల లోపు మెజార్టీతో గెలుస్తామనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేయడం గమనానర్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here