Featuredప్రాంతీయ వార్తలు

మహిళను తంతారా?

  • అమరావతి మహిళలపై ఇంత దారుణమా
  • 144 సెక్షన్‌ ఎందుకు విధించారు
  • మరోమారు ప్రశ్నించిన ఎపి హైకోర్టు

అమరావతి

ఏపీ పోలీసులు అమరావతిలో మహిళల పట్ల అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెజవాడ ర్యాలీలో పాల్గొన్న 610 మందిని ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నించింది. నిరసనలో పాల్గొన్నవారి ఐడీ కార్డులు ఎందుకు అడిగారని ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. నిరసనకారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఏజీ న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. మహిళను బూటుకాలితో మగ పోలీస్‌ తన్నడంపై కోర్టు వివరణ అడిగింది. మహిళ నోరు ఎందుకు బలవంతంగా నొక్కారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప.. 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. అయితే 2014 నుంచి రాజధాని గ్రామాల్లో 144, 30 యాక్ట్‌ అమల్లో ఉన్నాయని, వాటిని కొనసాగిస్తున్నామని.. కొత్తగా అమలు చేయటంలేదని ఏజీ వివరించారు. రాజధాని వీధుల్లో పోలీసులు మార్చ్‌ ఫాస్ట్‌..పరేడ్‌ చేయాల్సిన అవసరం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. అమరావతిలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని ఏజీ చెప్పారు. ఏజీ సమాధానంతో సంతృప్తి చెందని హైకోర్టు.. మరి ఎందుకు పోలీసు బలగాలు మోహరించాయని ప్రశ్నించింది. ముందు జాగ్రత్త చర్యగా అల్లర్లు జరగకుండా పోలీసులు మోహరించారని ఏజీ సమాధానమిచ్చారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close