త్వరలో ఏపీలో పర్యటిస్తా : అసదుద్దీన్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు గుణపాఠం నేర్పిస్తాయంటూ హెచ్చరించారు. తెలంగాణలో ప్రజాకూటమి పేరుతో చంద్రబాబు పర్యటించడంపై పరోక్షంగా అసదుద్దీన్‌ స్పందించారు. అంతేకాదు త్వరలో ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబుకు రెండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. తాను త్వరలో ఏపీలో పర్యటిస్తానని అసదుద్దీన్‌ ప్రకటించారు. అయితే ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తారు లేక ఎంఐఎం పార్టీ తరపున ప్రచారం చేస్తారా అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. అలాగే టీఆర్‌ఎస్‌ చీఫ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో కలిసి దేశమంతా పర్యటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌,బీజేపీయేతర కూటమికి ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీకీ వ్యతిరేకంగా దేశమంతా ప్రచారం చేస్తామని రాష్ట్రాల హక్కులపై పోరాడతామన్నారు. తమ పోరాటానికి కలిసొచ్చే వారితో కూటమిగా ఏర్పడతామని అసదుద్దీన్‌ ఓవైసీ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకొన్నారు. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీతో కలిసి దేశ వ్యాప్తంగా పర్యటించనున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్‌ వ్యూహత్మకంగా అడుగులు వేయనున్నారు.

దేశానికి తెలంగాణ మోడల్‌ రాజకీయాలను చూపుతామపి కేసీఆర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీల నుండి దేశం విముక్తి కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.దేశంలో మైనార్టీల సంక్షేమం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీతో కేసీఆర్‌ చర్చించారు. డిసెంబర్‌ 10వ తేదీన కేసీఆర్‌ ఈ విషయమై అసదుద్దీన్‌తో చర్చించారు. దేశంలో మైనార్టీలు ఎంత శాతం ఉన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటనే విషయమై వీరిద్దరూ చర్చించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ తో కలిసి కేసీఆర్‌ పర్కటించనున్నారు. అసద్‌ సెక్యులరిస్ట్‌ అంటూ కేసీఆర్‌ అయనను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణలో ప్రజలను ఏకం చేసిన తరహలోనే దేశంలో కూడ ప్రజలను ఏకం చేస్తామని చెప్పారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నాలు చేస్తామని కేసీఆర్‌ చెబుతున్నారు. గుణాత్మక మార్పును నెల రోజుల్లోనే చూస్తారని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ విషయమై పలు పార్టీలతో చర్చించేందుకు కేసీఆర్‌ త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here