Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

కారుకు బ్రేకేసేనా..?

  • మళ్లీ తెరపైకి కేంద్రపాలిత ప్రాంతం
  • ఆలోచనాత్మకంగా బిజెపి అడుగులు.
  • పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రతినిధులు

వేగంగా దూసుకెళ్తున్న కారు వేగాన్ని తగ్గించాలి. ప్రజల్లో గులాబీ పార్టీపై వ్యతిరేకతను పెంచాలి. కింది స్థాయిలో ఉన్న పార్టీ క్యాడర్‌ ను విచ్చిన్నం చేస్తూ రాష్ట్రస్థాయి నాయకత్వ బృందం ఆలోచనలను మార్చాలి. అందుకు అవసరమైనా ప్రతి అవకాశాన్ని తన వైపుగా తిప్పుకుంటూ కాషాయం పార్టీని బలోపేతం చేయాలని బిజెపి తహతహలాడుతోంది. తెలంగాణలో పాగా వేయాలని, వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని బిజెపి పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల నుంచి నిర్విరామంగా శ్రమిస్తోంది. కాని వారి శ్రమ అంతా కొన్ని వర్గాలకే, కొంతమంది ప్రజల వరకు మాత్రమే వెళుతోంది. చాపకింద నీరులా పార్టీని విస్తరిస్తున్నామని చెపుతున్నా బిజెపికి తెలంగాణలో ఎంత బలముందో, పార్టీకి ఎంత క్యాడర్‌ ఉందో మొన్ననే తెలిసిపోయింది. కనీసం ఓట్లకూడా సాధించుకోలేక డిపాజిట్‌ కొల్పొయిన పరిస్థితి కాషాయం పార్టీది. కొన్ని పోలింగ్‌ బూత్‌ లలో కూర్చోవడానికి ఏజెంట్‌ లు కూడా లేని పరిస్థితి అక్కడ కనబడింది. ఎంతసేపటికి ప్రకటనలకే పరిమితమవుతున్న బిజెపి పార్టీకి కింది స్థాయిలో బలం లేదని మరోసారి రుజువయ్యింది. బిజెపి బలాన్ని పెంచుకోవడంతో పాటు, తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీని ఇరుకున పెట్టి మొత్తం దెబ్బతీసే ఆలోచనలో బిజెపి వ్యూహాలవిూద వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఇప్పుడు తెరపైకి మళ్లీ హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతం చేసేలా పావులు కదుపుతోంది. అందుకు పనులు కూడా చకచకసాగేలా కేంద్రం నుంచి ప్రతినిథుల బృందం కూడా వచ్చివెళుతున్నారనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇరుకున పెడుతూ తమ అధిపత్యాన్ని ప్రదర్శించేలా బిజెపి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నట్లు సమాచారం

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌:

తెలంగాణలో ఎలాగైనా జెండా పాతాలి. కాషాయం రెపరెపలు ప్రతి గ్రామంలో ఉండాలి అందుకు ఎన్ని మార్పులు చేసేందుకైనా కేంద్రం సిద్దమవుతోంది. హుజూర్‌ నగర్‌ లో బిజెపికి వచ్చిన ఓట్లు వారిలో నిరాశతో పాటు, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరింత కసి కూడా పెరిగినట్లు తెలిసిపోతుంది. హుజూర్‌ నగర్‌ లో కెసిఆర్‌ ఎన్నికల ప్రచారానికే పోలేదు. ఆర్టీసీ సమ్మె కారణంగా టీఆర్‌ఎస్‌ పై పీకల్లోతు కోపం కార్మికుల్లో ఉంది. వారికి మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకమయ్యారు. కేసీఆర్‌ తీరుతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న అంచనాల నేపథ్యంలో హుజూర్‌ నగర్‌ లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం కేసీఆర్‌ కూడా ఊహించనిదే. అందుకే హుజూర్‌ నగర్‌ కృతజ్ఞత సభలో ప్రజలనుద్దేశించి ‘కేసీ ఆరే రైట్‌’ అని విూరు ఆశీర్వదించారని, ఇక ధైర్యంగా ముందుకెళుతానని కేసీఆర్‌ అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. బహిరంగసభలో కెసిఆర్‌ మాటలు ఆయన ఆత్మవిశ్వాసం బిజెపి నాయకత్వానికి అస్సలే రుచించడం లేదని తెలుస్తోంది. ఉప ఎన్నికలు జరిగినా హుజూర్‌ నగర్‌ లో బీజేపీ దారుణ ఓటమిని చవిచూసింది. మూడో స్థానంలో వచ్చిన స్వతంత్ర అభ్యర్థికంటే వెనుకబడి నాలుగో స్థానంలో నిలిచి డిపాజిట్‌ గల్లంతు చేసుకొని చరిత్రలోనే చూడని ఘోర ఓటమిని కాషాయం పార్టీ దక్కించుకుంది. ఎంపీ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే తెలంగాణలో పాగా వేయాలని చూసిన బీజేపీకి ఇప్పుడు ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ కేసీఆర్‌ సాధించిన విజయం చూశాక చెక్‌ పెట్టడం ఎలా అని కమలదళం మల్లగుల్లాలు పడుతున్నారట..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close