ఐపీఎల్‌ సీజన్‌-13 లో ధోనీ ఆడతాడా..?

0

హైదరాబాద్‌ : ఐపీఎల్‌ 12వ సీజన్‌ ముగిసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. దీంతో

టైటిల్‌ కోసం పోరాడిన ఆ జట్టు ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్రికెట్‌ అభిమానులందరిలోనూ ఇప్పుడు ఒకే

ప్రశ్న మెదులుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడతాడా..? లేదా..? అని. అయితే, దీనిపై ధోనీ

స్పందించాడు. ‘దేశం కోసం 2019 ప్రపంచకప్‌ గెలవడానికి క షి చేయడమే నా బాధ్యత. చెన్నై జట్టు తరఫున ఈ సీజన్‌లోనూ మంచి క్రికెట్‌ ఆడాం.

జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అన్నీ సహకరిస్తే మళ్లీ వచ్చే ఐపీఎల్‌ ఆడతానని అనుకుంటున్నాను’

అని ధోనీ పేర్కొన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అన్ని విభాగాల్లోనూ ముందుండి నడిపిస్తున్న ధోనీ గత కొంతకాలంగా వెన్నునొప్పితో

బాధపడుతున్నాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో డ్రెస్సింగ్‌రూమ్‌కే పరిమితం అయ్యాడు. ఈ సీజన్‌లో రెచ్చిపోయి ఆడిన ధోనీ రానున్న ప్రపంచకప్‌లో

భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ధోనీ 15 మ్యాచుల్లో 83.20సగటుతో

416 పరుగులు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here