సీబీఐ ప్రతిష్ఠను కాపాడేందుకు.. వారిని పంపేశాం..

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సీబీఐ ప్రతిష్ఠను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు అధికారులు (సీబీఐ డైరెక్టర్‌, స్పెషల్‌ డైరెక్టర్‌) పరస్సరం ఆరోపణలు చేసుకున్నందున నిస్పక్ష పాతంగా విచారణ జరిగాలని మంగళవారం భేటీ అయిన సీవీసీ నిర్ణయించిందని జైట్లీ చెప్పారు. సీవీసీ తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చేందుకే తాము ఉత్తర్వులు జారీ చేశామని ఆయన చెప్పారు. సీబీఐలో ఇద్దరు సీనియర్‌ అధికారులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, అందుకే అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాను సెలవుపై మాత్రమే పంపిం చామన్నారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా జరుగుతోందని, ఈ కేసును విచారించేందుకు సరికొత్త బృందాన్ని నియమించామని అరుణ్‌జైట్లీ తెలిపారు. సీబీఐ ప్రత్యేక అధికారి రాకేశ్‌ ఆస్థానాపై నమోదైన కేసు విచారిం చేందుకు సీబీఐ డీఐజీ తరుణ్‌ గోబా, ఎస్పీ సతీశ్‌ దాగర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ వి.మురు గేశంను నియమించామని జైట్లీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here