Featuredస్టేట్ న్యూస్

బంగారు తెలంగాణలో ”బెగ్గర్‌లేంది” సీఎం సారూ…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : అందరూ బాగుండాలి.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో కూడా ఏ ఒక్క బెగ్గర్‌ ఉండకూడదూ… బిక్షాటన చేసేవారికి ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నాం… నగరంలో ఏ కాలనీ చూసినా బిక్షువులు ఏకుండా కనిపించాలి… వారిని గుర్తించేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం… అంటూ గత ప్రభుత్వ పాలకులతో పాటు అధికారులు కూడా ఎన్నో ప్రగల్బాలు పలికారు. కానీ వారి మాటలు ఆచరణలో పెట్టి ఆ పని చేయాడానికి కనీసం వారం రోజులు కూడా కాలేదు. కొద్ది రోజులుగా కనిపించని బెగ్గర్‌లు మళ్ళీ యధాస్థిలో కనిపిస్తున్నారు. ఏకంగా బెగ్గర్‌లను పెంచి పోషించడానికి ఓ ముఠానే నగరంలో సంచరిస్తోంది. అనాధ పిల్లలతో పాటు పొట్ట కూటి కోసం వలస వచ్చిన దూర ప్రాంత ప్రజల పిల్లలను రోజు వారిగా అద్దెకు తీసుకుని మరీ

అడుక్కునేందుకు ప్రోత్సహిస్తు ముఠా బాగోతాలు అంతా ఇంతా కాదు. అడుక్కుంటున్న పిల్లల మాటలు వింటుంటే ఒళ్ళు గొగుర్పుట్టేలా అనేక నిజాలు బయటపడుతున్నాయి. పిల్లలతో పాటు మరొకరిని పంపిస్తూ వారి బంగారు బాల్యాన్ని బజారు పాలు చేస్తున్నారు. … కొందరు బాలలు బిక్షమెత్తడం ఇష్టం లేకపోయినప్పటికి వారు పెట్టే బాధలు తట్టుకోలేక బిక్షమెత్తున్నామని కన్నీరు కారుస్తూ వారి ఆవేధన వెళిబుచ్చుతున్నారు.. బంగారు తెలంగాణ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధానిలో బిక్షాటన ఓ అతిపెద్ద వ్యాపారంగా మారిపోయింది. గత పాలకులతో పాటు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా నగరంలో బెగ్గర్‌లు లేకుండా చూడాలని, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా తనికీలు నిర్వహించి బిక్షాటన చేస్తున్న వారందనికి అదుపులోకి తీసుకుని వారికి ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే అట్టి ఆదేశాలు ఎక్కువ కాలం నిలువలేదు కదా ఏ ఒక్క బెగ్గర్‌ కూడా మారిన దాఖలాలు లేవు. కాగా సికింద్రాబాద్‌, నాంపల్లి, చిక్కడపల్లి తదితర రైల్వేస్టేషన్లతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలు, కూడళ్ళలో చిన్నపిల్ల నుండి ముదుసలి వరకు వందల సంఖ్యలో బిక్షాటన చేస్తూ రోడ్లపైనే జీవనం గాస్తున్నారు. వీరు ఉండడానికి నీడ కానీ, తినడానికి తిండి కానీ లేకపోవడం వల్ల రోడ్లపై, బస్టాండు ఆవరణలలో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. నగరంలో కొంత మంది ఓ ముఠాగా ఏర్పడి చిన్నపిల్లలను తీసుకొచ్చి మరొకరికిచ్చి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడాళ్ళలల్లో తిరుగుతూ డబ్బులు అడుక్కు రావాలంటూ హుకూం జారీ చేస్తునట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఒక్కో ముఠా వద్ద పది మంది నుండి 25 మంది వరకు చిన్నపిల్లలతో పాటు ముసలి వాళ్ళు కూడా ఉంటున్నారని, పొద్దాంతా సంపాదిస్తే రూ. 5 వందల నుండి 15 వందల రూపాయల వరకు డబ్బులు వసూలు అవుతాయని, అయితే అందులో పిల్లలకు రూ. 2 వందల నుండి 250 రూపయాల వరకు ఇంచి పెద్దలకు రూ. 300 నుండి 350 వరకు ఇస్తుంటారని బిక్షాటల చేస్తున్నవారు చెబుతున్నారు.

డబ్బులు దొరకకపోతే కొడతరు…

ఉదయం లేవగానే రెండు నెలల పాపను ఎత్తుకుని పాల సీసా పట్టుకుని చిరిగిన బట్టలు వేసుకుని బజారుకు వచ్చి ఒక్కో రూపాయి పోగు చేసి ఆ ముఠా నాయకులకు ఇవ్వాలని, ఆ రోజు డబ్బులు తక్కువగా వచ్చినా అసలు పైసలు దొరకున్నా కర్రతో కొట్టి నానా హింసలు పెడతారని బిక్షాటన చేస్తున్న మహిళలు కన్నీటీ పర్యంతమవుతు వివరించారు. చిన్న పిల్లలకు కూడా ఉదయం నుండి రాత్రి వరకు తామే పాలు అడుక్కుని తాగించాలని, ఆకలేస్తే తినడానికి కూడా చేతిలో డబ్బులుండవని అంటున్నారు. అయితే రాత్రి అయిందంటే ఆ చిన్నపిల్లలను వారికి అప్పగించి తాము ఎక్కడో ఒక గల్లీలో ఓ మూలకు పడుకుంటామని చెబుతున్నారు. అయితే చిన్నపిల్లలను ఇచ్చే వారు వారి పేర్లు బయటకు చెప్పకూడదు, అడ్రస్‌ కూడా చెప్పొద్దంటూ ఆంక్షలు పెడతారని తెలంపారు. అయితే హైదరాబాద్‌ మహా నగరంలో వేల సంఖ్యలో ఉన్న బిక్షువులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసినప్పటికి వారు అందులో ఉండడం లేదని మళ్ళీ అదే పనిగా అడుక్కోవడం మొదలు పెడుతున్నారని అధికారులు అంటున్నారు. కాగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ బిక్షగాళ్ళు ఎక్కువవడంతో ప్రయాణీలు, పర్యాటకులు, పాదాచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ అధికారులు బెగ్గర్‌ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేసి నగరంలో బెగ్గర్లు లేకుండా చేసి ప్రభుత్వానికి సహాకరించి బంగారు తెలంగాణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close