రఫేల్‌పై విచారణకు.. ఎందుకు వెనకడుగేస్తున్నారు?

0
  • ఎన్డీయే హయాంలో ఉద్యోగాలు పోయాయి.. ఆర్థిక వృద్ధి పోయింది
  • ఇప్పుడు రఫేల్‌ పత్రాలు కూడా పోయాయి
  • డాక్యుమెంట్లు దొంగతనం వెనక ఎవరున్నారో తేల్చాలి
  • అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై దర్యాప్తు జరపాలి
  • ప్రధాని మోదీని కూడా విచారించాలి
  • కూటములపై తమ పార్టీలో ఎలాంటి గందరగోళం లేదు
  • ఢిల్లీ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే ఒంటరిగా పోటీకివెళ్తున్నాం
  • కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, మార్చి7(ఆర్‌ఎన్‌ఎ) : రఫేల్‌ ఒప్పందంలో అవినీతి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం ఉందని, అవినీతి జరగకపోతే రఫేల్‌పై విచారణకు మోదీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. రఫేల్‌ ఒప్పందం విషయమై నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ మరోసారి పదునైన విమర్శలు చేశారు. రఫేల్‌ పత్రాలు చోరీ అయ్యాయని ప్రభుత్వం చెప్పిందంటే అందులోని సమాచారం నిజమైనదేనని స్పష్టమవుతోందని అన్నారు. అంటే ఒప్పందంలో అవినీతి జరిగిందని రుజువైందని కేంద్రాన్ని దుయ్యబట్టారు. రఫేల్‌ పత్రాలు కన్పించకుండా పోయాయంటే అందులోని సమాచారం నిజమేనని స్పష్టమవుతోందన్నారు. దీన్నిబట్టి చూస్తే రఫేల్‌ ఒప్పందంలో మోదీ జోక్యం ఉందని, ఈ ఒప్పందంపై ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపారనేది రుజువైందన్నారు. పత్రాల చోరీపై దర్యాప్తు జరుపుతామని కేంద్రం చెబుతోందని, కానీ రూ. 30వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తిపై(మోదీని ఉద్దేశిస్తూ) మాత్రం ఎలాంటి దర్యాప్తు చేపట్టట్లేదని ప్రశ్నించారు. రఫేల్‌ ఒప్పందానికి మోదీ బైపాస్‌ సర్జరీ చేశారని, అనిల్‌ అంబానీకి ప్రయోజనం చేకూర్చేందుకే కొనుగోలును ఆలస్యం చేశారని రాహుల్‌ మరోసారి ఆరోపించారు. అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై దర్యాప్తు జరపాలని, ప్రధానిని కూడా విచారించాలని రాహుల్‌ అన్నారు. ఎన్డీయే హయాంలో ఉద్యోగాలు పోయాయని, ఆర్థిక వృద్ధి పోయిందని, ఇప్పుడు రఫేల్‌ పత్రాలు కూడా కన్పించకుండా పోయాయని దుయ్యబట్టారు. కానీ చౌకీదార్‌ మాత్రం భద్రంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక ఎయిర్‌ స్టైక్ట్‌ప్రై తాను మాట్లాడదలుచుకోవడం లేదన్నారు. కానీ పుల్వామా అమర వీరుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో వారున్నారని.. అసలేం జరిగిందో తెలియజేయమంటున్నార న్నారు. కూటములపై తమ పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని ఆయన తెలిపారు. ఇక ఢిల్లీ విషయంలో తమ రాష్ట్ర కమిటీ ఒంటరి పోరుకే నిర్ణయం తీసుకుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here