ఆమె స్థానంలో ఎవరున్నా..

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రఫేల్‌ ఒప్పందంపై విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమర్థించుకున్నారు. సీతారామన్‌ స్థానంలో ఎవరున్నా ఇలాంటి వ్యాఖ్యలే చేసేవా డినని స్పష్టం చేశారు. దుబాయ్‌లో జరిగిన విూడియా సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామన్‌కు బదులుగా రపేల్‌ ఒప్పంద పత్రాలను ప్రధాని పార్లమెంటులో

సమర్పించాలన్నారు. ‘ప్రధాని ఈ ఒప్పందం ద్వారా రూ.30వేల కోట్లు దోచుకొనేలా అనిల్‌ అంబానీకి సహకరించారు. పార్లమెంటులో ఇతరులతో మాట్లాడించకుండా ప్రధాని రఫేల్‌ అంశంపై మాట్లాడాలి. సీతారామన్‌ స్థానంలో మరో వ్యక్తి ఉన్నా నేను ఇలాంటి వ్యాఖ్యలే చేసేవాడిని. అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఆ ఒప్పందంపై మాట్లాడటానికి ప్రధానికి ధైర్యంలేదు’ అని తీవ్రంగా మండిపడ్డారు.

రాజస్థాన్‌లో ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..56 అంగుళాల ఛాతీ ఉన్న వ్యక్తి ఓ మహిళ వద్దకు వెళ్లి తనను రక్షించమని కోరారని ప్రధానిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. 'మొదటి సారి భారత పుత్రిక రక్షణ మంత్రి ¬దాలో పనిచేస్తున్నారు. ఆమె పార్లమెంటులో రఫేల్‌ ఒప్పందం విూద ప్రతిపక్షాల నోర్లు మూయించారు. కానీ వారు మాత్రం మహిళా శక్తిని అవమానించారు' అని ఆగ్రా పర్యటన సందర్భంగా ప్రధాని మండిపడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై రాహుల్‌కు జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here