గెలుపు ఎవరిది? కూటమిదా? కారుదా?

0

తెలంగాణలో అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకు జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 119 నియోజకవర్గాల్లో శుక్రవారం (డిసెంబర్‌ 7) పోలింగ్‌ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1821 అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. పోలింగ్‌ పూర్తవడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమికి 65కి పైగా స్థానాలు వస్తాయని, టీఆర్‌ఎస్‌ కు 35 నుండి స్థానాలు వస్తాయని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చెబుతుంటే సిఎస్‌ఎస్‌ కారుకు, కూటమికి టగ్‌ఆఫ్‌ వార్‌గా ఉంటుందని పేర్కొంది. జాతీయస్థాయిలో సర్వేలు చేసే ఇతర వార్తా సంస్థలు టిఆరెస్‌ వైపే విజయం ఉందని చెబుతున్నాయి. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకు జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 119 నియోజకవర్గాల్లో శుక్రవారం (డిసెంబర్‌ 7) పోలింగ్‌ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1821 అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. శుక్రవారం ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. పోలింగ్‌ పూర్తవడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే.. కిందటిసారి కంటే పోలింగ్‌ తక్కువగా నమోదైన నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆసక్తి పెరిగింది. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమికి 65కి పైగా స్థానాలు వస్తాయని, టీఆర్‌ఎస్‌ కు 35 నుండి స్థానాలు వస్తాయని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చెబుతుంటే సిఎస్‌ఎస్‌ కారుకు, కూటమికి టగ్‌ఆఫ్‌ వార్‌గా ఉంటుందని పేర్కొంది. జాతీయస్థాయిలో సర్వేలు చేసే ఇతర వార్తా సంస్థలు టిఆరెస్‌ వైపే విజయం ఉందని చెబుతున్నాయి. లగడపాటి టీఆర్‌ఎస్‌ 35(ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 10) ప్రజాకూటమి 65 (ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 10) బీజేపీ 07 (ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 02) ఎంఐఎం 06 -07 ఇండిపెండెంట్‌ 07-09 టైమ్స్‌ నౌ టీఆర్‌ఎస్‌ 66 మహాకూటమి 37 బీజేపీ 7 ఇతరులు 9 (ఎంఐఎంతో పాటు) సీఎన్‌ఎక్స్‌ టీఆర్‌ఎస్‌ 50-65 ప్రజాకూటమి 38 -52 బీజేపీ 4-7 ఇతరులు 10- 17 న్యూస్‌-18 టీఆర్‌ఎస్‌ 50-65 మహాకూటమి 38-52 బీజేపీ 4-7 ఇతరులు 8-14 ఇండియా టుడే టీవీ టీఆర్‌ఎస్‌ 79 -91 ప్రజాకూటమి )21-33 బీజేపీ 1-3 ఎంఐఎం47 ఆరా న్యూస్‌ టీఆర్‌ఎస్‌…..75-85 ప్రజాకూటమి..25-35 బీజేపీ..2-3 ఎంఐఎం 7-8 ఇతరులు..0 రిపబ్లికన్‌ జన్‌కీ బాత్‌ టీఆర్‌ఎస్‌..50 -65 ప్రజాకూటమి..38-52 బీజేపీ..4-7 ఇతరులు..8-14

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here