Featuredస్టేట్ న్యూస్

ఆ రూ.150 కోట్ల ఆంధ్రుడు ఎవరు..?

? బెదిరింపుల కోసమే లేఖ

? జగన్‌, బాబు, సిఎం రమేష్‌ కాదు..?

? టివి9 లావాదేవీలేనా..?

? ‘లింకుల లంకె’ గాలానికి చిక్కేది ఎవరు?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

కేంద్రం గుప్పిట చిక్కిన ఆ ఆంధ్రా ముఖ్యుడు ఎవరబ్బా..? కేంద్రం ఏ రాజకీయ ప్రముఖుడిని తన కాళ్ళ దగ్గరకు రప్పించుకోవడానికి ఈ ‘ఉచ్చు’ వార్త బయటకు వదిలిందా..? లేక రాజకీయులను గందరగోళంలోకి నెట్టే వ్యూహందో భాగంగా ‘మైండ్‌ గేమ్‌’ మొదలెట్టిందా..? రూ 150కోట్లు తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ముఖ్యుడు అంటే… ఎవరు..? రాజకీయ వేత్తలా..? పారిశ్రామిక వేత్తలా..? కుంభకోణాలే వృత్తిగా ఎంచుకున్న 420 నాయాళ్ళా…? ఎవరు.? ఎవరు..? ఎవరు…? గత 72 గంటలుగా ఖరీదైన నేరగాళ్ళ మధ్య నలుగుతున్న.. సలుపుతున్న.. అసలు దొంగ ఎవరు..? ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న పరిశీలన కథనం.

అసలేం జరిగింది..:

సీబీడీటీ అనగా ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటన చేసింది. అందులో… ఐటీ శాఖ ఈనెల తొలివారంలో దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. అందులో భాగంగా ఢిల్లీ, హైదరాబాద్‌, పూణే, ఆగ్రా, ముంబై, ఈరోడ్‌, గోవా ప్రాంతాలలో ప్రముఖుల ఇండ్లు, సంస్థలపై ఈ దాడులు జరిగాయి. దాదాపు రూ. 3300 కోట్ల హవాలా రాకెట్ను, అందులో ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల పాత్ర… అందులో ఉందని అప్పుడే కొత్తగా కనిపెట్టినట్టుగా ఖరాఖండిగా తెగేసి చెప్పింది. 42 చోట్ల నిర్వహించిన ఈ సోదాల్లో తేలిన ప్రధాన విషయాల్లో ఒకటి? మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనగా నీటిప్రాజెక్టులు, రోడ్లకు వెచ్చించిన నిధులను తప్పుడు మార్గాల్లో దారి మళ్లించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ప్రముఖుడికి 150 కోట్లు చెల్లించినట్టు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ఇదీ ఆ ప్రకటన సారాంశం.

ఆ ప్రముఖడు ఎవరు..?:

పార్టీల వారీగా ఊకదంపుడు విూడియాలు ఉన్నాయి కాబట్టి… ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసిందంటే బహుశా చంద్రబాబు అయి ఉండకపోవచ్చు?? ‘చంద్రబాబు’ అని ఏమాత్రం సందేహం వచ్చినా సరే, ఆ వార్త వారు రాయకుండా ఉంటారు. అది వారి స్వేచ్ఛ. మరి ఎవరబ్బా ఆ ముఖ్యుడు..? కేంద్ర ప్రభుత్వం చంద్రబాబును కార్నర్‌ చేయటానికి తగిన ఆధారాల కోసం వెతుకుతున్నదనే సంగతి కరెక్టే. ఇక ‘కేసీఆర్‌ దొరుకుతాడా’ అని చూస్తున్నదనీ పొలిటికల్‌ సర్కిళ్లల్లో ఉన్న ప్రచారం. అయితే ‘ఆంధ’ ప్రస్థావన కావడంతో ఆయన సేఫ్‌. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులు అంటే..? కొంపదీసి ‘మేఘా’ కంపెనీ లేదా సీఎం రమేష్‌ కంపెనీ గానీ ఏమైనా అలా దారి మళ్లించాయా..? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొంత కొంతకాలంగా ఎడాపెడా ప్రాజెక్టులు పొందుతున్న కంపెనీ మేఘా ఒక్కటే. చంద్రబాబు పీరియడ్లో ప్రాజెక్టులు పొందిన వాటిల్లో సీఎం రమేష్‌ కూడా ఉన్నాడు. కానీ ఈమధ్య ఆయన ఆఫీసులపై ఏ దాడులూ జరగలేదు. భాజపాలో చేరిన సిఎం.రమేష్‌ అయితే ఐటి శాఖ అస్సలు ప్రెస్‌ రిలీజ్‌ చేయదు. అంటే ఆయన కాదు. పైగా అవన్నీ రివర్స్‌ టెండరింగులో చిక్కుకున్నట్టున్నాయి?! పోలవరం కంట్రాక్టులు పొందిన నవయుగ కాదు కదా?? ఆ కంపెనీ ఆఫీసులపై ఈమధ్య కాలంలో ఏవిూ దాడులు జరగలేదు. ఆమధ్య వారం రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి ‘మేఘా’ కంపెనీపైనే? కానీ సీబీడీటీ మాత్రం ‘ఈనెల మొదటివారంలో జరిగిన దాడులు’ అని చెబుతుంది. అంటే మేఘా కూడా కాకపోవచ్చు? మరి ఎవరబ్బా..? ఇచ్చింది ఎవరు..? తీసుకున్నది ఎవరు..?

జగన్‌ కాదు..:

అధికారంలోకి వచ్చాక మొత్తం రివర్స్‌ టెండరింగులో మునిగిన ఆంధ్రా సిఎం.జగన్‌ కు ఇప్పుడప్పుడే ఎవరూ డబ్బులు ఇచ్చి ఉండకపోవచ్చు.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులు దారి మళ్లడం అంటే తప్పకుండా కంట్రాక్టు కంపెనీలు చెల్లించే డబ్బులే? ఎవరికి ఇస్తారు..? అధికారంలో ఉన్న ప్రముఖులకే ఇస్తారు. అవీ ఎన్నికల ముందు రాజకీయ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. ఈమధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగిన ఎన్నికలు ఏవిూ లేవు. ఇదంతా రకరకాల ఊహాగానాలు రెక్కలు వచ్చి ఎగురుతున్నాయి.

లావాదేవీలు ఎప్పుడు..?:

సీబీడీటీ బోర్డు చెబుతున్న లావాదేవీలు అసలు ఏ కాలంలో జరిగినవి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్‌ మార్కు. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్ని రాజకీయ అవసరాల కోసం దారి మళ్లించిన ఆధారాల కోసం కేంద్రం కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నదనే ప్రచారం ఉన్నదే. మరి కేంద్రం గుప్పిట చిక్కబోతున్న ఆ ఆంధ్రా ముఖ్యుడు ఎవరబ్బా..?

అటు ఇటు తిరిగి టివి9 దగ్గర ఆగి..:

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ ఆరోపిస్తున్నట్టు రెండు కార్పొరేటు కంపెనీల నడుమ జరిగిన హవాలా చెల్లింపులు కాదు కదా?! ఏమో?? ఏపీ నుంచి ఓ ఆంధ్రా ముఖ్యుడు కాంగ్రెస్‌ పార్టీకి మొన్నటి ఎన్నికల ముందు డబ్బులు అడ్జెస్ట్‌ చేశాడనే ప్రచారం ఉంది. లావాదేవీలు అంటున్న ఐటీ శాఖ… అవి డబ్బుల రూపంలోనే జరిగాయా..? మరో రూపంలో అంటే.. షేర్ల మార్పిడి, భూ బదలాయింపు, బంగారం రూపంలో మారకం.. ఇలా ఏదైనా జరగవచ్చు.

చివరిగా..:

తెలుగునాట ఓ ఐటీ లేఖ ఒక్క హింటూ దొరక్కుండా రాసాననే భ్రమలో ఉన్న ఆ శాఖ.. ఆ లెటర్‌ ద్వారా ఎవరిని బెదిరిస్తుంది. ఎందుకు బెదిరిస్తుంది. ఎంత కాలం బెదిరిస్తుంది. ఛీ విూ ‘గులాంగిరి’ ఇంకా ఎన్నాళ్ళు.. ఎన్నేళ్ళు..?హవాలా ‘హవా’నే వేరు. మెగా కృష్ణప్పా..చివరి దెబ్బ మనదైతే ఆ కిక్కే వేరప్పా.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close