రైతు ‘హత్య’కు బాధ్యులు ఎవరు. ?

0

రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌

రైతు అత్మాభిమానానికి ప్రతీక. అప్పు చేస్తే సమా ధానం చెప్పలేక.. తాను చనిపోతాడు తప్ప మరొకరిని నిందించడు. కనీసం ఆత్మహత్యకు ఫలాన వారే అని ఎక్కడా.. ఎప్పుడూ చెప్ప లేదు. కానీ ఈ ‘హత్య’కు బాధ్యులు ఎవరు..? అసలు నిందితులు ఎవరు..? ప్రభుత్వం ఈదిశలో ఆలోఛన చేస్తే.. బంగారు తెలంగాణలో.. కేసీఆర్‌ అనుకు ంటున్న ఆకాంక్షలు నిజమౌవుతాయి. మొగ్గ లోనే తుంచి వేయకపోతే భవిష్యత్తులో దోషులుగా కాకున్నా… తప్పును సరిదిద్దని వారుగా చరిత్రలో మిగులుతారు.

అసలేం జరిగింది: ‘రైతుబంధు’ పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం… రైతు అంతారం ఈర్‌ రెడ్డి(52)కి సత్యగామ శివారులో 8.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు సక్రమంగా పండ కపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా బేగంపేటకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నాడు. మొదటి విడత రైతు బంధు కింద ఆయనకు రూ.32,800 చెక్కు మంజూరైంది. రెండో విడతకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉండటంతో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఈర్‌ రెడ్డి ఇంటి పేరుతో పాటు బ్యాంకు ఐ.ఎఫ్‌. ఎస్‌.సీ కోడ్‌ తప్పుగా

నమోదవ్వడం వల్ల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీంతో తన భూమి ఏమైపోతుందోనని ఈర్‌ రెడ్డి తరచుగా దిగులు పడేవాడు. ఈనెల 7న సత్యగామకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి శుక్రవారం ఉదయం సొంత వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

తప్పెవరిది: ఈ విషయంలో రైతు తప్పు లేదు. కాని… ఏవరో చేసిన పనికి తాను బలైయ్యాడు. ఇప్పటికైనా… అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణాలో.. మరో రైతు ఆత్మహత్య చూడకూడదని ‘ఆదాబ్‌’ భావిస్తోంది. ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించి మరో దారుణం జరక్కుండా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here