ప్రధాని ఎవరనేది ఇప్పుడే కాదు..

0

బెంగుళూరు: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేది అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకొంటామన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో చర్చించిన తర్వాత గురువారం సాయంత్రం బెంగుళూరులో మాజీ ప్రధాని దేవేగౌడతో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్‌ పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబునాయుడు మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు.బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటు కోసం చంద్రబాబునాయుడు ప్రయత్నాలను దేవేగౌడ అభినందించారు.సెక్యులర్‌ పార్టీలను మరింత ముందుకు తీసుకెళ్లాలని దేవేగౌడ చంద్రబాబును కోరారు. లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఏర్పడిందన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలను బీజేపీ నాశనం చేస్తోందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మోడీని గద్దె దించేందుకు ఈ శక్తులు ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉందన్నారు. జేడీఎస్‌ చీప్‌,మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగుళూరులోని దేవేగౌడ నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు.ఇందులో భాగంగానే దేవేగౌడ, కుమారస్వామిలతో చంద్రబాబునాయుడు చర్చించనున్నారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికగా బీజేపీయేతర పార్టీలకు వేదికగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో కూడ బీజేపీయేతర పార్టీల ఫ్రంట్‌ ఏర్పాటు విషయమై చంద్రబాబునాయుడు వారం రోజుల క్రితం చర్చించారు. ఈ ఫ్రంట్‌ ఏర్పాటును వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో బాబు ఇవాళ బెంగుళూరుకు వెళ్లాడు. రెండు మూడు రోజుల తర్వాత చంద్రబాబునాయుడు తమిళనాడు రాష్ట్రానికి కూడ వెళ్లనున్నారు. డీఎంకె చీఫ్‌ ఎంకె స్టాలిన్‌ తో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. బీజేపీయేతర పార్టీల ఫ్రంట్‌లో చేరాలని డీఎంకెను ఆహ్వానించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here