Featuredరాజకీయ వార్తలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు.?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) ప్రతి రాజకీయ నాయకుడిలో ఓ ఆశ. అదే ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం. మరణిస్తే ..అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. దొంగలకోసం వెతికే పోలీసులతో గౌరవ వందనం కోరుకోవడం. ఆకాశంలో ఏడుసార్లు కాల్పులు. తమ వారసుల ధీర్ఘకాలిక ప్రయోజనాల కోసం.. రాజకీయుల ఆత్మ.. పరమాత్మ అగమ్యగోచరంగా తిరుగాడటం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల క్రతువు ఎట్టకేలకు ప్రశాంతంగా పూర్తయింది. అన్ని పార్టీలు డబ్బు, మద్యం బాగానే పంచారు. అధికార పార్టీ కొంచెం అధికం. డబ్బులు పంచే వ్యవహారంలో ప్రతిపక్షాలు వందకోట్లతో పట్టుబడగా… అధికారపార్టీ మాత్రం ఆశ్చర్యకరంగా ‘సుద్దపూసలా’ ఉండటం విశేషం. అన్ని పార్టీలు చేయాల్సినవి అన్నీ చేశాయి. అంతిమంగా ఎవరు విజేత..? తెలంగాణ మలి ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం ఎవరు చేస్తారు..? సస్పెన్స్‌ థ్రిల్లర్‌ స్టోరీని ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ బ్రేక్‌ చేస్తోంది. విూడియా గత నాలుగున్నర సంవత్సరాలుగా యాడ్స్‌ తో ఊగింది… ఇంకా ఊగాలి. ఊగుతోంది కూడా.! అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరి లాభాపేక్ష వారిది. ఎగ్జిట్‌ పోల్స్‌ రకరకాలుగా.. అదీ అధికారపక్షం వైపు మొగ్గు చూపగా ‘లగడ’పాటి మాత్రం కూటమి వైపు మొగ్గారు. ”అదాబ్‌ హైదరాబాద్‌” ప్రత్యేక పరిశీలన సంచలన కథనం. తెరాస గెలిచినా…: తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచినా సిఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ముఖ్యమంత్రి కాలేరు. ఆయన వెన్నంటి ఉన్న వారిలో తెలుగుదేశం పార్టీ వారు సగంపైనే ఉన్నారు. వీరందరికీ నారా చంద్రబాబు ‘టచ్‌’లో ఉన్నారు. ఈ భయంతోనే తెలంగాణ చంద్రుడు నారా చంద్రబాబుపై ప్రతి సభలోనూ విమర్శలు సంధించారు. దీంతో మొదటి రెండు స్థానాల మధ్య సీట్ల వ్యత్యాసం కేవలం 15 సీట్లు మాత్రమే. అంటే 11మందితో ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఎవరు తరలించుకు పోతే వారే తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి. అందులో హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, కడియం శ్రీహరి, కె.కేశవరావు… ఎవరైనా కావచ్చు.. అందరి దృష్టి ముఖ్యమంత్రి పీఠం అంతిమ లక్ష్యం. కూటమిలో..: మహాకూటమిలో భాగస్వామి పక్షం తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకోలేదు. అయితే కోరిక మాత్రం వేరే ఉంది. అదే రాజకీయం. తెలుగుదేశం పార్టీ నుంచి చాలా తెలివిగా తన విశ్వాసపాత్రులైన అనుయాయులు రేవంత్‌ రెడ్డి, కృష్ణయ్యలను వ్యూహాత్మకంగా రంగలోకి దించింది. అందుకే తెలుగుదేశం పార్టీ ఏనాడూ సీట్ల కోసం పట్టుబట్టలేదు. ఏ పరిణామం వచ్చినా..అంటే కుల పరంగా .. తెరాసను చీల్చడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. భాజపా కీలకం.. మజ్లీస్‌ మౌనం: రాజకీయ బద్దశత్రువులు భాజపా, మజ్లీస్‌ పార్టీలు కలిసే అవకాశం లేదు. ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా భాజపా పుంజుకోనున్నది. ఇది భాజపా అధిష్టానం కూడా ఊహించనిది. 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో 6సీట్లు సంపాదించే మజ్లీస్‌, భాజపాలు కీలకం. అయితే ఏంపి ఎన్నికల దృష్ట్యా ఈ రెండూ పార్టీలు ఒకే ఒరలో ఇమిడే అవకాశం లేదు. ఇది తెరాసకు ఊహించని శరాఘాతం. పార్టీల వారీగా తెలంగాణరాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పదవి కోసం.. క్యూలో ఉన్నవారు వీరే.!: తెరాస నుంచి.. (1) కేసీఆర్‌ (2) కేటీఆర్‌ (3) హరీష్‌ రావు (4) కవిత (ముందు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలో ఎమ్మెల్యే / ఎమ్మెల్సీ అవుతారు) తెదేపా నుంచి రమణ (ముందుగా ప్రమాణం చేసి.. తరువాత ఆరు నెలలో ఎమ్మెల్సీ అవుతారు) కూటమిలో… (1) ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (2) జానారెడ్డి (3) రేవంత్‌ రెడ్డి (4) కృష్ణయ్య (5) హన్మంతరావు (6) సర్వే సత్యనారాయణ (7) భట్టి విక్రమార్క (8) దామోదర రాజనర్సింహ (9). ఎమ్మెల్సీ ¬దాతో సీల్డ్‌ కవర్‌ లో వచ్చే అవకాశం. భాజపా.. (1) కిషన్‌ రెడ్డి (2) లక్ష్మణ్‌ (3) పరిపూర్ణనందస్వామి బిఎల్‌ఎఫ్‌: తమ్మినేని సిపిఐ : చాడా వెంకట్‌ రెడ్డి ఎంఐఎం : ఓవైసీ? అభ్యర్థుల తరలింపుకు ఏఐసీసీ ఆదేశాలు: కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థులను కాపాడుకోవడం కోసం ఏఐసీసీ అధిష్టానం ఏకంగా బెంగుళూరులో శిబిరం (క్యాంప్‌) ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం మైసూర్‌ వారసులను హైదరాబాద్‌ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక వ్యక్తి సంప్రదించినట్లు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’కు స్పష్టమైన సమాచారం అందింది. ఇందుకు నారా చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కొసమెరుపు: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య 8-10 సీట్ల వ్యత్యాసం ఉంటే స్వతంత్ర అభ్యర్ధులకు భలే డిమాండ్‌. కనీసం వంద కోట్ల రూపాయల విలువైన తాయిలాలు. ఏ పార్టీని పదిమంది వచ్చినా.. వేయికోట్ల నజరానా..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close