నేరెళ్ళ నేరం ఎవరిది..? ఏడాదైనా ఎందుకీ మౌనం..!

0

నెత్తురోడిన నేరెళ్ల బాధితులు ఒంటరై పోయారు. బాధితుల ఒంట్లో రక్తం కంట్లో తగ్గేరు ఇంకిపోయాయి సంఘటన జరిగి ఏడాది కావస్తున్నా కనీసం చార్జిషీటు దాఖలు చేయకపోవడాన్ని ఏమనాలి ! బాధితుల తరఫున గొంతెత్తాల్సిన ప్రతిపక్షాలు మూగబోయాయే రాజ్యహింసకు వ్యతిరేకంగా వీడిత వర్గాలస్తీ ఏకమవుతున్నాయి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేరెళ్ల సంఘటనకు ప్రతీకారంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ తీర్పును ప్రకటించేందుకు అన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు నేరెళ్లలో పర్యటించి విచారణ జరిపి నివేదిక సమర్పించినా ఇంతవరకు న్యాయం జరగకపోవడం బాధాకరం బంగారు తెలంగాణలో ప్రశ్నించడమే నేరమైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాజ్యానికి అంతిమ తీర్పును ప్రకటించాశిం దేనని ప్రజలంతా ఏకమవ్వడం విశేషం.
శ్రీధర్ యాలాల ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్,ఆదాబ్ హైదరాబాద్ : నేరెళ్ళ సంఘటనపై ఎందుకీ మౌనం.. రాజకీయ పార్టీల రభస ఆగిపోయింది ప్రజాస్వామ్య గొంతులు పెగలడం లేదు.. వనరుల విధ్వంసం అన్నోళ్ళు అడ్రస్ లేరు. హక్కుల సమస్య అన్నోళ్ళు దిక్కులేరు. కాదు కాదు ఇది ముమ్మాటికీ రాజ్యహింస,రాజ్య అణిచివేత అన్నోళ్ళు పత్తాలేక పోగా..ఇది కేవలం రాజకీయ ఆర్థిక సమస్య మాత్రమే కాదు కులసమస్య అన్నవాళ్ళు కూడా మద్దతులేక మౌనం వహిస్తుంటే నెత్తురోడిన నేరెళ్ళ నేడు ఒంటరైంది. బాధితుల ఒంటో రకం , కంటో కన్నీరు రెండూ ఇంకిపోయాయి. రాజ్యాన్ని ప్రశ్నించటం అంటే లారీగుద్ది చంపటం అంతటి ప్రమాదం అని ఆ ఎనిమిది కుటుంబాలకే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి వర్తిస్తుందని దొరల ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది. లారీలు తగులబెడితే చూస్తూ ఊరుకుంటారా ..? అంటూ దళితులను అవమానించిన కేసీఆర్ కు మనుషులను లారీలతో గుద్దిచంపితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా..? అనే ప్రశ్న స్పురించకపోవడం వెనుకాల దొరహంకారంతో పాటు దానికున్న చారిత్రిక నేపథ్యమూ ఇమిడివుంది. తెలంగాణలో ఒకప్పుడు దొరల కాళ్ళకిందనో , ఎడ్లబండ్ల చక్రాల కిందనో పడి నలిగిన దళితుల, కింది కులాల ప్రజల జీవితాలు నేడు అదే దొరభూస్వాముల లారీల కిందపడి నలుగుతున్నాయి. అయితే లారీలతో గుద్దిచంపిన వాళ్ళను కానీ, లారీ యజమానులను కానీ, ఇసుక కాంట్రాక్టర్ లపైన కానీ కేసులు నమోదు చేయకపోగా, బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి, ఆ సంఘటనకు ఎలాంటి సంబంధంలేని ఎనిమిది మంది దళిత యువకులపై తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టడం అనేది అత్యంత దుర్మార్గం. రోజుకో శవం చొప్పున ప్రజల ప్రాణాలు బలి అవుతుంటే గుండెలవిసిన బిడ్డలు లారీలకు అడ్డుపడడం నేరమా ? నిలదీసి ప్రశ్నించడమే వాళ్ళు చేసిన నేరమా ? అందుకు ప్రతిఫలం జీవితకాలం జీవచ్ఛవాలుగా మారడమా? ఒకే వారంలో ముగ్గురిని బదనపురం భూమయ్య (ఎరుకల), కరుణాకర్, మల్లేశం లను బలిగొన్న ఇసుక మాఫియా రక్త దాహానికి ఇంకా ఎంతమంది బలికావాలి? ఇదే ప్రశ్న ప్రతి గుండెనూ మేల్కొల్పింది . ప్రతి గుడిసెను తట్టి లేపింది. అంతే, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు చస్తున్నారో స్పష్టంగా బోదపడింది. కడుపు మంటతో ఊరు ఊరంతా రగిలిపోయింది. ఎరుకలి భూమయ్య మరణమే చివరి మరణం కావాలని అనుకున్న ఊరంతా ఏకమయ్యింది . కట్టలు తెంచుకున్న ప్రజల ఆవేశం దావాణలమై లారీని దహించివేసింది.
| కానీ పోలీసుల రంగప్రవేశంతో సీను కాస్త రివర్పై నేరస్తుల స్థానంలోకి బాధితులు , బాధితుల స్థానంలోకి నేరస్తులు చేర్చబడ్డారు. అంటే నేరస్తులైన లారీ డ్రైవర్లు, లారీ యజమానులు, ఇసుక కాంట్రాక్టర్లు బాధితులైండ్రు, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాలు నేరస్తుల స్థానంలోకి నెట్టబడ్డారు. తనపని తాను చేసుకుపోవాల్సిన చట్టం ఎప్పటిలాగే దొరల ఇంటి కాపలా కుక్కై కాంట్రాక్టర్ లతో కుమ్మక్కైంది. రాత్రికి రాత్రి రంగం సిద్ధమైంది. అరెస్టుల పర్వం మొదలైంది. 02/07/2017 అర్ధరాత్రి నేరెళ్ళ గ్రామాన్ని దిగ్భందించిన పోలీసులు ఊరును వల్లకాడు చేసి, భార్యల ముందే భర్తలను జీపుల్లో కుక్కి 12 మందిని రహస్య ప్రాంతానికి తరలించారు. అరెస్టు చేసిన వారిలో నలుగురిని మాత్రం విడిచిపెట్టి ఎనిమిది మందిని (పెంట బానయ్య, పసుల ఈశ్వర్ కుమార్, బోలా హరీష్ చెప్యాల బాలరాజు, సికోటి శ్రీనివాస్, గంధం గోపాల్, బత్తుల మహేష్, ఓరుగంటి గణేష్) లాకప్ లో బంధించారు. ఒక్కొక్కర్నీ బట్టలు విప్పి, కిటికీ ఊచలు నుండి చేతులు బయటికి లాగి పట్టుకొని , నగ్నంగా నిలబెట్టి 18 లాఠీలతో 18 మంది పోలీసులు అవి విరిగే వరకు ఆపకుండా గొడ్లను బాదినట్లు బాదారు. వీపు, పిర్రలు వాచి, చిట్టిపోయి రక్తాలు కారే వరకు కొట్టారు. రోకలిబండలు ఎక్కించి, చెవులకు, మర్మాంగాలకు కరెంటు షాకుపెట్టి పైశాచికానందాన్ని పొందారు. ఇలా మొత్తం నాలుగు రోజులపాటు “థర్డ్ డిగ్రీ” ప్రయోగించిన పోలీసులు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. రత్తాలు కారుతున్న గాయాలపై వేడినీళ్ళు పోశారు. స్వయంగా విశ్వజిత్ భాదితులను బెల్టుతో కొట్టడమేగాక రబ్బరు లాఠీలతో బత్తుల మహేష్ చాతిపై కొట్టడంతో చాతి ఎముక విరిగిపోయింది. నేరెళ్ళ మాజీ సర్పంచ్ (దళిత) అయిన బాధితుడు పెంట బాసయ్యను బూతులు తిడుతూ మొఖంపై బూటుకాలుతో తన్ని, గొంతుపై కాలువేసి నులుమడంతో స్పృహతప్పి పడిపోయాడు. అయితే ఎస్పీ విశ్వజిత్ ఇంతటితో ఆగకుండా తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ మీరు మీ భార్యలకు ఇంకేం పనికి వస్తార్రా.. మీ భార్యలను మా దగ్గరికి పంపండి లేదా మీ భార్యలపై వ్యభిచారం కేసులు పెతానంటూ, మీ కుటుంబ సభ్యులను ఎన్ కౌంటర్ చేసి చంపుతానంటూ బూతులు తిట్టి మరోసారి లారీలు ఆపతారా అంటూ బెదిరించాడు. 08/07/2017న ఉదయం 10 గంటలకు భాదితులను కోరుకు తీసుకువెళ్ళారు. సాయంత్రం కోర్టు నుండి జైలుకు తీసుకురాగా బాధితుల ఒంటిపై గాయాలు చూసిన జైలర్ తీవ్ర గాయాల కారణంగా ఇందులో ఎవరు మరణించిన తనపైకి వస్తుందని తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో పోలీసులు మళ్ళీ అదే వ్యాసులో “తంగళ్ళ పెళ్లి “ పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి, మరునాడు మళ్ళీ జైలుకు పంపారు. కోర్టు విచారణ తదనంతరం కండిషన్ బెయిల్ పైన విడుదల అయిన భాదితులు వేములవాడలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్న సందర్బంలో కూడా పోలీసులు, సిసి కెమెరాల నిఘాలో బాధితులు గడపాల్సి వచ్చింది. అయితే ప్రజల ఒత్తిడి మేరకు కేటీఆర్ బాధితులను పరామర్శించి ఎస్పీని తప్పించి ఎస్సైని సస్పెండ్ చేయించి చేతులు దులుపుకున్నాడు, కానీ నిజమైన దోషులను అరెస్టు చేసేవరకు బాధితులు పోరాటానికి సిద్దపడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, దళితులను అవమానపరచి చిత్రహింసలు పెట్టిన విశ్వజిత్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఇసుక కాంట్రాక్టర్ మరియు లారీ యజమానులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తూ, ఇసుక మాఫియాను మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తుందని, కెసిఆర్ చుట్టం అయిన సంతోష్ రావు మరియు ఇతర బంధువులు ఇసుక మాఫియాలో భాగమేనని భావిస్తున్నారు. అది ప్రభుత్వం తలపెట్టిన నిర్మాణ కార్యక్రమాలకు పనికి వస్తుందని సాకు చూపుతూ ఇషా రాజ్యంగా కాంట్రాక్టర్లకు ఈ ప్రాంత ఇసుక రీచ్లు అప్పగించారు. రోజుకు కనీసం వెయ్యి లారీలు, లక్షా ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలిస్తున్నాయని అంచనా. ఒక లారీ ఇసుక తవ్వుకు పోయినందుకు ప్రభుత్వం వసూలుచేసేది రు. 8,250 కాగా ఒక లారీ ఇసుకను ఓపెన్ మార్కెట్లో అమ్మితే కనీసం ఆదాయం రు. 70-80 వేలు. దీనితో కాంట్రాక్టర్లు ఎట్లా కోట్లకు పడగెత్తుతున్నారో, అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎంత ముడుపులు చెల్లిస్తున్నారో ఊహించవలసిందే. ప్రత్యేకంగా నేరెళ్ల, జిల్లెల ప్రాంతంలో ఇసుక తవ్వుకు పోతున్న గోల్డ్మైస్ మినరల్స్ నలుగురు యజమానులలో ఇద్దరు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రాషకు సన్నిహిత బందువులు -నేరెళ్ళ ఘటనకు ముందు జరిగిన పరిణామాలు కూడా ఈ 8మంది యువకుల అరెస్టుకు కారణంగా కూడా వారు భావిస్తున్నారు. ఎరుకలి భూమయ్య మరణానికి ముందు జరిగిన అనేక సంఘటనల్లో ఈ
యువకులు ముందుండి ప్రశ్నించడం చేసారు. ఊరిలో ఉండే సమస్యలపై స్థానిక నాయకులను నిలదీయడం, ఊరిలో కొందరికి కంటగింపుగా మారింది. ముఖ్యంగా నేరెళ్ళ గ్రామంలో జరిగే గోపాలస్వామి రథోత్సవం సందర్భంగా ఊరి పెద్దల (వెలమ దొరలు)తో ఘర్షణ జరిగింది. గుడి దగ్గర వారం రోజులు జాతర జరుగుతుంది. ఆ సందర్భంగా రథం దగ్గర “బలి గంప” అంటే పసుపు, కారం కలిపిన అన్నం పెడుతారు, అయితే అది కేవలం కింది కులాల ప్రజలైన మాల, మాదిగలు, చాకలి, మంగలి కులాలకు కేటాయించబడుతుంది. దాన్ని దొరలైన వెలమలు, ఇతర అగ్రకులాల వాళ్ళు ఏమాత్రం ముట్టుకోరు. పైగా వారిముందే కుక్కలకు, పందులకు విసిరేసి కింది కులాలను అవమానిస్తారు. కానీ, వెలమ దొరలూ, ఇతర అగ్రకులాలకు చెందినా వారు గుడి లోపల పులిహెూర, దద్దోజనం పుష్టిగా తింటారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ,బీసీల్లో కింది కులాల వాళ్ళు గ్రామ సర్పంచ్ లేదా ఇతర ఉన్నాధికారులైనా సరే గుడి బయట నిలబడవలసిందే, గర్భగుడిలోకి వీరికి ప్రవేశం నిషిద్దం. వీరిలో ఎవరైనా లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అగ్రకులాల వాళ్ళు దారికి అడ్డంగా నిలబడతారు. ఇలా ఒకపక్క కులం కారణంగా, మరోపక్క ఇసుక అక్రమ రవాణా కారణంగా నేరెళ్ళలో దళిత, పీడిత కులాల ప్రజల జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. గ్రామంలో వెలమ దొరల ఆధిపత్యాన్ని నిలదీస్తూ, ఎదురు తిరిగి ప్రశ్నించినందునే తమకు ఈ దుస్థితి వచ్చిందని వారు భావిస్తున్నారు. అంతేగాక అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఎస్పీని సస్పెండ్ చేయకుండా కేటీఆర్ అతన్ని కాపాడే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఒకవేళ ఇసుక మాఫియాతో ఎలాంటి సంభందం లేనట్లయితే కేసీఆర్, కేటీఆర్లు ఎందుకు హంతకులను వేనుకేసుకొస్తున్నట్లు ? ప్రభుత్వ ప్రమేయమే గనుక లేనట్లయితే ఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయవలసివచ్చిందని హైకోర్టు సైతం ఎందుకు చివాట్లు పెట్టినట్లు ? భాదితులకు మెరుగైన వైద్యాన్ని అందించవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ బాధితులకు సరైన వైద్యాన్ని అందిచకపోగా, బాధితులు తమ సొంత ఖర్చులతో నిమ్స్ ఆసుపత్రిలో చేరితే హాస్పిటల్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి బాధితులను ఎందుకు బయటకి గెంటివేసినట్లు? ఇదంతా లారీ యజమానుల ఇసుక మాఫియాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తూ నేటికి దళిత, పీడిత కులాలకు చెందిన నేరెళ్ళ బాధితులను నేరస్తులుగా నిలబెట్టి వేదించడం గర్హనీయం. ప్రభుత్వాలు వాటి బాధ్యత నెరవేర్చనపుడు, చట్టం తన పని తాను నిర్వర్తించనప్పుడు ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. నేరెళ్ళలో ప్రజలు చేసింది కూడా అదే. లారీలు కాలబెట్టారని మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు ఎందుకని ఇన్నేండ్లుగా లారీల కిందపడి మరణిస్తున్న వారిగురించి మాట్లాడలేదు. ఇప్పటికీ ఇసుక అక్రమ రవాణాకి కారకులెవ్వరో, లారీల యజమానులెవ్వరో ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు? లారీలతో గుద్దిన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు, ఆ లారీలను ఎందుకు సీజ్ చేయలేదు? దీన్ని బట్టి ఇసుక మాఫియాతో కెసిఆర్ కుటుంబానికి సంభందాలు ఉన్నాయని, తెలంగాణా వ్యాప్తంగా విస్తరించివున్న ఇసుక అక్రమ రవాణాదారుల గుట్టురట్టవుతుందనే,
నేరెల్లలో ప్రజలు చేసిన తిరుగుబాటు మరేచోట జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందనేది ఋజువైంది. నేటికి నేరెళ్ళతోపాటు జిల్లెల్ల, రామచంద్రాపురంలోని ప్రజలు ఇసుక లారీల భయానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దినదిన గండగా బ్రతుకుతున్నారు. కాగా, ఆసరాగా ఉంటారని అనుకున్న వాళ్ళను కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి, మానసికంగా క ఎంగిపోయి, బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాయి. థర్డ్ డిగ్రీ పేరుతో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన భాదిత కుటుంబాలు చిత్రవధ అనుభవిస్తున్నాయి. ఒంటరైన ఎరుకలి భూమయ్య కుటుంబం పోలీసుల వేధింపులతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంది. తండ్రి మరణంతో పోలీసుల భయానికి పారిపోయిన భూమయ్య కొడుకు నేటికీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఉన్న ఒక్క దిక్కును కోల్పోయిన భూమయ్య కుటుంబంలో మూగ రోదనను అనుభవిస్తున్నది. ఇప్పటికైనా నేరెళ్ళ బాధితులకు న్యాయంచేయడంతోపాటు అటు పర్యావరణానికి ఇటు నీటి కరువుకు కారణమవుతున్న , మనుషులను మింగుతున్న ఇసుక లారీలను రద్దు చేసి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు గారు నేరెళ్ళలో పర్యటించి విచారణ జరిపి ఏడాది గడిచిన ఇంతవరకు భాదితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. రిపోర్ట్ ని బయటకు రాకుండా తొక్కి పెట్టారు అంటే ప్రభుత్వం ఎంతగా అణిచివేస్తుందో అర్ధం అవుతుంది. ఏడాది గడిచేనా సిరిసిల్ల ఘటనపై ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? మీడియా ముందు బోరున ఏడ్చిన సిరిసిల్ల బాధితులు సీరిసిల్ల లో జనం ను చంపేస్తున్న ఇసుక లారీ లపై ఇప్పడికి ఒక్క కేసు పెట్టలేదని నేరెళ్ళ బాదితులు తెలిపారు. ఇసుక మాఫియా వెనక ఖచ్చితంగా కేటీఆర్ ఉన్నారని అన్నారు. కేటీఆర్ ,లారీలనే అడ్డుకుంటారా అని మా పై ఎస్పీ థర్డ్ డిగ్రీతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కరెంట్ షాక్ పెట్టి హింసించారని తెలిపారు. ఏడాది గడుస్తున్నా ఇప్పడికి తమకు గాయాలు మానలేదని తెలిపారు. తాము చేసిన తప్పేంటి … ఇప్పటికి కేసులతో వేధిస్తున్నారని అన్నారు. కేటీఆర్ వస్తుందంటే ఇప్పటికీ తమను పోలీసుల పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారని తెలిపారు నేరెళ్ళ బాదితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here