సేవ చేసిన వాణ్ణి.. చేవ ఉన్న వాణ్ణి

0

అంబర్‌పేట్‌ టిఆరెస్‌ టికెట్‌ నాకివ్వండి

ఓం ప్రకాశ్‌యాదవ్‌ వినతి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి పార్టీలో ఉంటూ ఇప్పటి వరకు రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్న తనకు టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి అంబర్‌పేట నియోజకవర్గ అసెంబ్లీ సీటు ఇవ్వాలని బద్దుల ఓం ప్రకాశ్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు.

ఉన్నత విద్యాధికుడు ఎంఏపిహెచ్‌డి చేసిన ఓం ప్రకాశ్‌ యాదవ్‌ ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి ఎలక్షన్‌ ఇన్‌చార్జి కాచిగూడ డివిజన్‌ 2001 నుంచి రవీందర్‌ యాదవ్‌, కార్పోరేటర్‌ అభ్యర్థికి, నాయిని నర్సింహ రెడ్డి అప్పుడు మేయర్‌ క్యాండెట్‌కు ఇంచార్జిగా వ్యవహరించానని తెలిపారు. మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో 2016, కాచిగూడ, నల్లకుంట, అంబర్‌పేట్‌ డివిజన్‌, గోల్నాక డివిజన్‌ వద్ద ఉండి పార్టీకి నిరంతరం పని చేసి వారందరిని గెలిపించుకున్నానని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక ఉద్యమాలు చేశానన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని తెలిపారు. ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేసినందుకు తనపై అనేక మార్లు హత్యాయత్నాలు జరిగాయన్నారు.కాచిగూడ డివిజన్‌లో పేద ప్రజల కోసం నీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలను తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డిని అధికారులతో నిరంతరం పోరాటం చేసి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయడం జరిగిందన్నారు.

తన నిరంతర పోరాటం వల్లే కాచిగూడ ప్రజల సమస్యలు తీర్చగలిగానన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చింది అని గుండెల నిండా ఆనందంతో పొంగిపోయానని ఆయన అన్నారు. ఈ తరుణంలో ఇంకా అన్యాయం జరగకుండా అంబర్‌ పేట నియోజకవర్గ పేద ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను అందించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఎన్నో ఉద్యమాలు, రాస్తారోకోలు, బస్సు యాత్రలు చేసినందుకుగానుతనపై అనేక కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. కావున తనకు అంబర్‌ పేట నియోజకవర్గ అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానాన్ని ఆయన కోరారు. అధిష్టానం తనకు టికెట్‌ ఇస్తే నిజాయితీ నిబద్దతతో ప్రజల మెప్పు పొంది తెలంగాణ రాష్ట్ర మరియు అంబర్‌పేట నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని, భాద్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here