Featured

మహిళకేదీ భద్రత..

అమ్మో.. భాగ్యనగరమా…

భయపడుతున్న యువతులు..

ఒంటరిగా ఉండేవారిలో భయం..

నీడను కూడా నమ్మలేని పరిస్థితి..

భయం.. ఇప్పుడు నగరంలో ఉన్నత చదువుల కోసం వచ్చిన యువతుల నోట భయం.. ఒంటరిగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న మహిళల నోట భయం.. తరచూ కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినీల నోట భయమే ఇప్పుడు ప్రధానంగా వినిపించే పదం.. ఎవ్వరిని నమ్మాలో, ఎవ్వరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితి ఇప్పుడు మహిళది.. ఎవరూ ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారో, ఎవరి మనసులో ఉలాంటి ఆలోచన ఉందో తెలియక క్షణక్షణం భయం నీడన బతకాల్సిన పరిస్థితి వస్తుంది.. అత్యంత దారుణంగా నరరూప రాక్షసుల చేతుల్లో అతివ బలైపోతున్న ఇంకా బూజుపట్టిన సిద్దాంతాలను, పనికి మాలిన చట్టాలనే పట్టుకొని వేళాడుతున్న చాతకాని వ్యవస్థ మనది.. వేదికలెక్కి గొప్పగా నీతులు వల్లబోస్తున్న మహిళలకు భాగ్యనగరంలో ఎంత భద్రత ఉందో, మన పాలకులు ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇటీవల జరుగుతున్న నిరంతర సంఘటనలు చూస్తేనే అర్థమవుతోంది. తాగుతోతులు, ఆకతాయిలు, రౌడీమూకలు చేతిలో సగటు మహిళ జీవితం సర్వనాశనమైపోవడమే కాకుండా ప్రాణాలు సైతం గాలిలో కలిసే సంధర్బాలు ఉన్నాయి.. రోజురోజుకు ఇంతగా కామాంధులు రెచ్చిపోతున్న నగరంలో భద్రత మాత్రం అంతా డొల్లగానే కనబడుతోంది. వివిధ పనుల మీద వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినవారు ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండాలంటేనే వణికిపోతున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్‌లో జరిగినా అత్యంత ఘోరమైనా సంఘటన హైదరాబాద్‌నే కాకుండా దేశాన్నే వణికించింది. హైదరాబాద్‌ అంటే ఆసక్తి చూపేవారు ఇప్పుడు హైదరాబాద్‌ అంటేనే మహిళలకు భద్రత లేని నగరంగా పేరుపోతుంది. చెప్పలేని మాటలతో, రాయలేని పదాలతో ఇన్ని దారుణాలు జరుగుతున్న పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంలో పాలకులు విఫలం చెందుతున్నారు. ఆడపిల్లకు రక్షణ కల్పించలేని నగరంగా హైదరాబాద్‌ పేరుగాంచబోతుందనే విషయం అర్థమైపోతుంది. తప్పుచేసిన వాడికి సత్వరమే కఠినశిక్ష విధించే బలమైన చట్టాలు లేకుండా పోయాయి. అందుకే కామాంధులు రాబందుల్లా పెట్రేగిపోతున్నారు. పాలకుల పనితీరు వలన మంచి బ్రాండ్‌ పేరున్న భాగ్యనగరం పేరు అమ్మాయిల భద్రతతో వెనక్కిపోతున్నట్లు తెలుస్తోంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి) : ఉండాలా… నగరాన్ని విడిచి వెళ్లాలా ఇదే ఇప్పుడు ప్రతి మహిళ మదిలో మెదులుతున్న ప్రశ్న.. భాగ్యనగరంలో రోజురోజుకు అడ్డుఅదుపులేకుండా పెరుగుతున్న లైంగిక వేధింపులు.. అఘాయిత్యాలు.. అత్యాచారాలతో యువతులు వణికిపోతున్నారు.. ఏ క్షణాన ఏమి జరుగుతుందో, ఎవరూ ఏలా వచ్చి దాడులు చేస్తారో అర్థం కాక భయపడుతున్నారు. అమ్మాయిల భద్రత రోజురోజుకు భరోసా లేకుండా తయారవుతోంది. పకడ్బందీ చర్యలు లేక, పట్టించుకునే వారు లేక భద్రత కనుమరుగవుతోంది.. హైదరాబాద్‌ అంటేనే అన్నింటికి అనుగుణంగా ఉంటుందనే పేరు ఉండేది. బతకడానికి, వ్యాపారానికి, ఉన్నత చదువుల కోసం ఎంతోమంది నిత్యం వస్తూ ఉంటారు. పల్లెను విడిచి పొట్టచేత పట్టుకొని పట్నం వైపు బారులు తీరే వారే ఎక్కువమంది ఉన్నారు. దేశంలోనే ఐదు పెద్ద పెద్ద నగరాల్లో హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రోజురోజుకు అభివృద్ది చెందుతున్న సాప్ట్‌వేర్‌ రంగంతోపాటు, ఇతర పారిశ్రామిక రంగాలకు వాటికి తోడు షాపింగ్‌మాల్స్‌, విద్యాసంస్థలతో నగరం విస్తరిస్తూనే ఉంది. అలాంటి నగరంలో నేడు మహిళల భద్రత ఒక మిధ్యగా మారిపోయింది. ఇక్కడ ఉండాలన్నా, బతకాలన్నా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత వారం శంషాబాద్‌లో జరిగిన అమానుష, అత్యాచార సంఘటన హైదరాబాద్‌ నగరాన్నే కాదు దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. టెక్నాలజీ అభివృద్ది చెందుతూ, అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ, ఎక్కడో జరిగిన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకుంటున్న ఈ రోజుల్లో కూడా మృగాళ్ల చేతిలో ఆడవాళ్లు అత్యంత దారుణంగా బలైపోతున్న పట్టించుకునే వారు లేరు. అంతా జరిగాక నాలుగైదు రోజులు హడావుడీ చేసి, చేతులు దులుపుకునే సమాజంలో ఉంటున్నందుకు మహిళ భద్రతకు భరోసా ఎక్కడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది.

మహిళ భద్రత మిధ్యేనా..

గొప్పగా చెప్పుకుంటున్న భాగ్యనగరంలో ఇప్పుడు మహిళల భద్రత ఒక మిధ్యేగానే మిగిలిపోయింది. ఐటి, సాప్ట్‌వేర్‌ రంగం రోజురోజుకు విస్తరిస్తూ, దేశ, విదేశాల నుంచి నిత్యం ఎంతోమంది హైదరాబాద్‌ నగరానికి వస్తూనే ఉన్నారు. కాని వచ్చినవారికి భద్రత ఎంత భద్రంగా ఉందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. రాత్రి తొమ్మిది గంటలకే హైవే రోడ్డు పక్కన ఒక డాక్టర్‌ మీద నలుగురు దుర్మార్గులు అత్యంత దారుణంగా, అమానుషంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. దేశవ్యాప్తంగా అత్యంత బాధకరమైనా సంఘటనగా మారిపో యింది. ఎన్నిచట్టాలు తెచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, తప్పుచేసినా వాడికి శిక్ష పడుతోందనే భయం లేక పోవడం వలన రోజురోజుకు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలో నిత్యం వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది నిత్యం రహదారులపై తిరుగుతూనే ఉంటారు. భాగ్యనగరంలో ఏ గల్లీ చూసినా జనాలు బారులు తీరుతూ ఉం టారు. కాని అందులో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూ డదో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మహిళలపై ఉంది. భాగ్యనగరంలో నిత్యం ఎన్ని దారుణాలు జరిగినా నాలుగు రోజులు హడావుడీ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిపోయింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close